Lucky Zodiac Signs : సూర్య గ్రహణం రేపు (అక్టోబర్ 14న) రాత్రి 8:34 గంటల నుంచి అర్ధరాత్రి 2:25 గంటల వరకు ఉంటుంది. ఈ సంవత్సరంలో చివరి, రెండో సూర్యగ్రహణం ఇదే. ఇది దాదాపు 178 సంవత్సరాల తర్వాత వస్తున్న అరుదైన గ్రహణం. ఈ గ్రహణ సమయంలో సూర్యుడు ఉంగరం ఆకారంలో కనిపించడం వల్ల.. దాన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. పితృపక్షం చివరి రోజున మహాలయ అమావాస్య నాడు ఏర్పడుతున్న ఈ గ్రహణానికి.. 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం భారతదేశంపై ఉండదు. ఇది భారత్ లో కనిపించదు. అయితే ఈ సూర్య గ్రహణం ఐదు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
మిథున రాశి
ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. పెద్ద బాధ్యతలు దక్కుతాయి. కొత్త ఆదాయ వనరులు కనిపించొచ్చు. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. సూర్య గ్రహణ సమయంలో ఆదిత్య హృదయం చదివితే మంచి ఫలితం ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశివారు ఆర్థిక లాభాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలొస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులను జాగ్రత్తగా ఉంచాలి. వ్యాపారాలు చేసే వ్యక్తులు లాభాలను ఆర్జించవచ్చు. శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు తలవంచరు. ఆదిత్య హృదయంతో పాటు సూర్యుడి జపం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
తుల రాశి
తులా రాశిలోని ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. రవి, కేతు గ్రహాల జపాలు చేస్తే బాగుంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చికరాశికి చెందిన వ్యక్తుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సహకారంతో ఆర్ధికంగా లాభాలను పొందుతారు. మీ శ్రమ ఫలిస్తుంది. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారు నవగ్రహ జపం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మహిళలకు లక్ (Lucky Zodiac Signs) కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్, ఆస్తి, వాహన కొనుగోలుకు ఇది మంచి టైం. ఆర్థిక లాభాలు వస్తాయి.
Also Read: AP Govt – Civil Services : సివిల్స్ ప్రిలిమ్స్ కు ఎంపికైతే లక్ష.. మెయిన్స్ కు ఎంపికైతే 50వేలు
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.