ప్రతిష్టాత్మక మహా కుంభ మేళా (Maha Kumbh Mela ) 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh )లోని ప్రయాగ్ రాజ్(Prayagraj )లో జరగనున్న నేపథ్యంలో తిరుమల నుండి శ్రీవారి కళ్యాణ రథం (Srivari Kalyanaratham ) బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ రథం ప్రారంభోత్సవంలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు (Tirumala Tirupati Devasthanams (TTD) Chairman BR Naidu ), అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి రథానికి పచ్చ జెండా ఊపారు.
Chilli Powder : హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం..సీఎం మాత్రం ఒక ప్లేట్ రూ. 32,000 భోజనం – KTR
మహా కుంభమేళాలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. సెక్టార్ 6లోని భజరంగ్ దాస్ రోడ్డులో నాగ వాసుకి దేవాలయం సమీపంలో ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. తిరుమల తరహాలోనే ఈ నమూనా ఆలయంలో అన్ని కైంకర్యాలు 170 మంది సిబ్బందితో నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. కుంభమేళా కాలంలో నాలుగు సార్లు శ్రీవారి కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. జనవరి 18, 26తో పాటు ఫిబ్రవరి 3, 12 తేదీల్లో భక్తులకు ఈ పవిత్ర కైంకర్యాలను తిలకించే అవకాశం కల్పించనున్నారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే ప్రత్యేక అవకాశం లభించనున్నదని చైర్మన్ పేర్కొన్నారు.
అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం అయిన కుంభమేళాలో భాగంగా వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ మహా ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి గౌతమి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, హిందూ ధర్మ ప్రచార పరిషద్ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్లు శ్రీ రామకృష్ణ, శ్రీ మునిరత్నం తదితర అధికారులు పాల్గొన్నారు.