Site icon HashtagU Telugu

Krishna Janmashtami 2023 : ఇవాళ, రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. ఎందుకు ?

Janmashtami 2024

Janmashtami 2024

Krishna Janmashtami 2023 : ఇవాళ, రేపు (సెప్టెంబరు 6, 7 తేదీల్లో) శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోనున్నారు. కృష్ణుడు జన్మించిన సమయం అష్టమి ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళే కొందరు పండుగ జరుపుకుంటుండగా.. ఏడో తేదీ మొత్తం అష్టమి, రోహిణి నక్షత్రం ఉండండతో రేపు కొందరు ఫెస్టివల్ ను చేసుకోనున్నారు. అయితే పంచాంగకర్తలంతా సెప్టెంబరు 6నే కృష్ణాష్టమిని జరుపుకోవాలని సూచిస్తున్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని  రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజున స్మార్త సంప్రదాయం ప్రకారం, రెండో రోజు వైష్ణవ సంప్రదాయం ప్రకారం పండుగను నిర్వహించుకుంటారు. ఇలా రెండు రోజుల వేడుక ఎందుకంటే.. శ్రీ కృష్ణుడు శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని బహుళ అష్టమి అర్థరాత్రి సమయంలో రోహిణి నక్షత్రంలో జన్మించారు. అక్కడి నుంచి వసుదేవుడి ద్వారా గోకులంలో నందుడి ఇంటికి చేరుకున్నది మర్నాడు ఉదయం. అందుకే శ్రీ కృష్ణుడు జన్మించిన సమయానికి అష్టమి తిథి ఉండడం ప్రధానం అంటారు. అయితే వైష్ణవులు మాత్రం సెప్టెంబరు 7నే కృష్ణాష్టమిని జరుపుకుంటారు. ఎందుకంటే వారికి రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి ప్రధానం. మిగిలినవారికి కృష్ణాష్టమి ఈరోజే.

Also read : Today Horoscope : సెప్టెంబరు 6 బుధవారం రాశి ఫలాలు.. వారికి ప్రయాణాల్లో సమస్యలుంటాయ్

శ్రీ కృష్ణుడి అడుగులు.. 

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుడి అడుగులు బయటి నుంచి ఇంట్లోకి ఎందుకు వేస్తారంటే.. సాధారణంగా భగవంతులంతా, శ్రీ మహావిష్ణువు అవతారాలు, యోగులు, మహర్షులు అందరూ ఉత్తరాయణంలోనే జన్మించారు. అందుకే ఉత్తరాయణం పుణ్యకాలం అంటాం. దక్షిణాయనం విషయానికొస్తే చీకటికి ప్రతీక. దక్షిణాయణం కర్మకి ఆధారం. పైగా శ్రావణ మాసం వర్ష రుతువు అంటే వెన్నెల ఉండదు. వర్ష రుతువులో శుక్ల పక్షం-కృష్ణ పక్షంలో కృష్ణ పక్షం చీకటిగా ఉంటుంది. ఇలాంటి చీకట్లో అర్థరాత్రి జన్మించాడు శ్రీకృష్ణుడు. పైగా చెరసాలలో..అంటే ఎక్కడ ఉండకూడదో అక్కడ పుట్టాడు. అందుకే దక్షిణాయణం-కృష్ణపక్షంలో చిమ్మ చీకటి మధ్య జన్మించిన కన్నయ్య.. మన జీవితాల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలని.. జ్ఞానం అనే వెలుగు వైపు నడిపించాలని కోరుతూ శ్రీ కృష్ణుడి అడుగులను బయటి నుంచి ఇంట్లోకి వేస్తారు.

Exit mobile version