22 Special Trains : శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇందుకోసం 22 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇవన్నీ సికింద్రాబాద్ నుంచి కేరళలోని కొల్లం వరకు వెళ్తాయి. కొన్ని రైళ్లు నర్సాపూర్ నుంచి కేరళలోని కొట్టాయం వరకు, మరికొన్ని ట్రైన్స్ కాచిగూడ నుంచి కేరళలోని కొల్లం వరకు వెళ్తాయి. కాకినాడ టౌన్ నుంచి కొట్టాయంకి, కొల్లం నుంచి సికింద్రాబాద్‌కి కూడా రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌ల సౌకర్యం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
స్పెషల్ రైళ్ల వేళలు..
- అయ్యప్ప దర్శనం కోసం నడుపుతున్న స్పెషల్ రైళ్ల వివరాలలోకి వెళితే.. సికింద్రాబాద్ – కొల్లం (రైలు నంబర్ 07129) రైలు నవంబర్ 26, డిసెంబర్ 3 తేదీల్లో నడుస్తుంది. ఇది సికింద్రాబాద్‌లో ఆయా తేదీల్లో సాయంత్రం 4.30కి బయలుదేరుతుంది.
- కొల్లం – సికింద్రాబాద్ (రైలు నంబర్ 07130) ట్రైన్ నవంబరు 28, డిసెంబరు 5 తేదీల్లో నడుస్తుంది. ఇది కొల్లంలో ఆయా తేదీల్లో వేకువజామున 2.30 గంటలకు బయలుదేరుతుంది.
- నర్సాపూర్ – కొట్టాయం (రైలు నంబర్ 07119) ట్రైన్ నవంబర్ 26, డిసెంబర్ 3 తేదీల్లో నడుస్తుంది. ఇది నర్సాపూర్‌లో ఆయా తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరుతుంది.
- కొట్టాయం – నర్సాపూర్ (రైలు నంబర్ 07120) ట్రైన్ నవంబరు 27, డిసెంబరు 4 తేదీల్లో నడుస్తుంది. ఇది కొట్టాయంలో ఆయా తేదీల్లో రాత్రి 7 గంటలకు బయలుదేరుతుంది.
- కాచిగూడ – కొల్లం (రైలు నంబర్ 07123) ట్రైన్ నవంబరు 22, 29, డిసెంబరు 6 తేదీల్లో నడుస్తుంది. ఇది కాచిగూడలో ఆయా తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది.
- కొల్లం – కాచిగూడ (రైలు నంబర్ 07124) ట్రైన్ నవంబరు 24, డిసెంబరు 1, 8 తేదీల్లో నడుస్తుంది. ఇది కొల్లంలో ఆయా తేదీల్లో వేకువజామున 2.30 గంటలకు బయలుదేరుతుంది.
- కాకినాడ టౌన్ – కొట్టాయం (రైలు నంబర్ 07125) ట్రైన్ నవంబర్ 23, 30 తేదీల్లో నడుస్తుంది. ఇది కాకినాడ టౌన్‌లో ఆయా తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరుతుంది.
- కొట్టాయం – కాకినాడ టౌన్ (రైలు నంబర్ 07126) ట్రైన్ నవంబరు 25, డిసెంబరు 2 తేదీల్లో నడుస్తుంది. ఇది కొట్టాయంలో ఆయా తేదీల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరుతుంది.
- సికింద్రాబాద్ – కొల్లం (రైలు నంబర్ 07127) ట్రైన్ నవంబరు 24, డిసెంబరు 1 తేదీల్లో నడుస్తుంది. ఇది సికింద్రాబాద్‌లో ఆయా తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది.
- కొల్లం – సికింద్రాబాద్ (రైలు నంబర్ 07128) ట్రైన్ నవంబరు 25, డిసెంబరు 2 తేదీల్లో నడుస్తుంది. ఇది కొల్లంలో ఆయా తేదీల్లో రాత్రి 11 గంటలకు(22 Special Trains) బయలుదేరుతుంది.