Site icon HashtagU Telugu

Spirituality: పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

Spirituality

Spirituality

ప్రస్తుత రోజుల్లో చాలామంది దంపతులు పెళ్లి అయ్యి కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా పిల్లలు కలగడం లేదని బాధపడడంతో పాటు హాస్పిటల్స్ చుట్టూ గుళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పిల్లలు కలగడం లేదని వాపోతూ ఉంటారు. అలాంటప్పుడు రకరకాల యోగాలు, దానధర్మాలు పరిహారాలు చేయడంతో పాటు కొంతమంది దేవుళ్ళను కొలవమని చెబుతూ ఉంటారు. అందులో సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం కూడా ఒకటి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు అని చాలామంది అంటూ ఉంటారు. మరి ఈ విషయంలో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సుబ్రహ్మణ్యస్వామి నీ కుమారస్వామి అని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాగే ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క అవతారంలో కూడా సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి పూజించడం వల్ల సర్ప దోషం తొలగిపోయి సంతానం కలుగుతుందని చెబుతుంటారు. అందుకే చాలా వరకు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో మహిళలు అలాగే దంపతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. దీని వెనుక పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉంది. సుబ్రమణ్య స్వామి అష్టకం ఒక రోజు పార్వతి, పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలసానికి వస్తారు. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు.

దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్ణ్తిచినవి, జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్య స్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్య స్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది చాలా మంది నమ్మకం. సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన రోజున ఉపవాస దీక్షను చేపట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తారు. ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపిస్తారు. పుట్టలో పాలుపోసి బెల్లం అరటిపండ్లు నైవేద్యంగా సమర్పింస్తుంటారు. సంతానం కోసం సుబ్రహ్మణ్యషష్టి రోజున సుబ్రహ్మణ్యస్వామిని తప్పకుండా స్తుతించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

note: పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. వాటిని పాటించాలా వద్దా అన్నది మీ వ్యక్తిగతం మాత్రమే.