Pooja Room : ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే పూజ గది అలా ఉండాల్సిందే?

పూజ‌ గ‌ది (Pooja Room)లో దేవుడి విగ్ర‌హాలు లేదా ఫొటోలు పెట్టిన ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి.

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 07:00 PM IST

Pooja Room : మామూలుగా హిందువుల ప్రతి ఒక్కరి ఇళ్లలో దేవుడి గది తప్పనిసరిగా ఉంటుంది. అలాగే హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిదే కానీ దేవుడి పూజ గది (Pooja Room) విషయంలో కొన్ని రకాల నియమాలను పాటించడం తప్పనిసరి. ఎందుకంటే పూజ గది విషయంలో కొన్ని రకాల నియమాలను పాటించకపోతే పూజ చేసిన ఫలితం కూడా దక్కదు. మరి పూజ గది (Pooja Room) విషయంలో ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పూజ‌ గదిని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య మూలలో ఉండేలా చూసుకోవాలి. పూజ‌ గ‌దిలో దేవుడి విగ్ర‌హాలు లేదా ఫొటోలు పెట్టిన ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండాలి. పూజ‌ గది ఎప్పుడూ సరళంగా ఉండాలి. దానికి గోపురం లేదా త్రిశూలం ఉండకూడదు. పూజ గ‌దిలో పాలరాతి మందిరాలు పెట్ట‌డం అసలు మంచిది కాదు. చెక్కతో చేసిన మందిరాలే ఉత్తమమైనవి. అలాగే పూజ‌ గదిలో ఎక్కువ సంఖ్య‌లో దేవుని విగ్రహాలను ఉంచకూడదు. అదేవిధంగా పూజ గ‌దిలో దేవుడి క్యాలెండర్ ఉండకూడదు. కొంతమంది దేవుడి ఫోటోలు ఉన్నాయి కదా అని క్యాలెండర్లను పూజ గదిలో ఉంచుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు.

We’re now on WhatsApp. Click to Join.

పూజ గదిలో దేవుడి విగ్రహాలు ఎత్తుగా ఉండకూడదు. ఆ ఇంటి యజమాని యొక్క బొటనవేలు ఎత్తుకు సమానంగా లేదంటే అంతకన్నా తక్కువ ఉన్నా మంచిది. అలాగే ఇంట్లో చాలా మంది శివలింగాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటాడు. కానీ శివలింగాన్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదు.

ఒకవేళ ఇంట్లో శివలింగాన్ని ఉంచిన కూడా నిత్య అభిషేకం చేయాలి. బాల కృష్ణుడి విగ్రహం పూజ‌ గదిలో ఉండాలి. దానికి త‌ప్ప‌నిస‌రిగా రోజువారీ భోగాలు అందించాలి. పూజ‌గ‌దిలో నటరాజ విగ్రహం ఉండకూడదు. శ్రీరామ ప‌ట్టాభిషేకం, శివ కుటుంబం కలిసి ఉన్న విగ్రహం లేదా ఫోటో త‌ప్ప‌నిస‌రిగా పూజ‌గ‌దిలో ఉండాలి. శాంత స్వరూపంలో ఉన్న‌ దుర్గాదేవి విగ్రహాన్ని మాత్ర‌మే ఇంట్లో ఉంచాలి. పూజ గ‌దిలో మీ పూర్వీకులు లేదా త‌ల్లితండ్రుల ఫోటోలు పెట్టకూడదు. పూజ గదిలో ఎల్లప్పుడూ నిత్య దీపారాధన చేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా మూడు వినాయక విగ్రహాలు లేదా ఫోటోలు ఉంచకూడదు.. ఒక చేతిలో సంజీవిని పర్వతం, మరో చేతిలో గద పట్టుకున్న హనుమంతుడి విగ్రహం లేదా ఫొటో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ విగ్రహాన్ని పూజించడం ద్వారా గృహంలో సంక్షోభాలు తొలగిపోతాయి. ఇంట్లోని పూజ‌ గదిలో నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించడం మంచిది.

భగవంతుడి పూజ ఎప్పుడైనా ప్రశాంతంగా చేయాలి. పైన చెప్పిన విధంగా పూజ గది ఎప్పుడూ కూడా అలాగే ఉండటం వల్ల ఆ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది.

Also Read:  Thyroid Diet: థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!