Site icon HashtagU Telugu

Shadastaka Yogam : 4 రాశుల వాళ్ళూ .. జులై 1 వరకు బీ అలర్ట్ !!

Shadastaka Yogam

Shadastaka Yogam

Shadastaka Yogam : అంగారక గ్రహానికి “కుజుడు”, “మంగళుడు” అనే పేర్లు ఉన్నాయి.  ‘కు’ అంటే భూమి. ‘జ’ అంటే పుట్టినవాడు. భూమి నుంచి పుట్టినవాడు కాబట్టి  అంగారకుడికి “భూమి కుమారుడు” అనే పేరు ఉంది. మంగళుడి పేరు మీదే  వారంలోని మూడో రోజును మంగళవారం అని పిలుస్తున్నారు. అంగారకుడు తన రాశిని మార్చుకొని.. మే 10న కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యాడు. చంద్రుడి సొంత రాశి..  కర్కాటకం. ఇందులోకి ఎంట్రీ ఇవ్వగానే అంగారకుడు వీక్ అయిపోయాడని వేద జ్యోతిషశాస్త్రం చెబుతోంది.  జలకారక గ్రహమైన  చంద్రుడి ఆధీనంలోని కర్కాటక రాశిలోకి .. అగ్ని కారక గ్రహమైన అంగారకుడు ప్రవేశించగానే మునుపటి స్థాయిలో బలాన్నికొనసాగించలేడని నిపుణులు  అంటున్నారు. మరో 50 రోజులు (జూలై 1 వరకు) కర్కాటక రాశిలోనే అంగారకుడు కంటిన్యూ అవుతాడు. ఈక్రమంలో అంగారకుడు, శని గ్రహాలూ కలిసి “షడష్టక యోగాన్ని” (Shadastaka Yogam)  సృష్టిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు.అంగారకుడు కోపానికి, హింసకు కారకుడు.. శని దుఃఖానికి, దారిద్ర్యానికి  కారకుడు. ఈ రెండింటి కలయికతో ఏర్పడబోయే షడష్టక యోగం 4 రాశులవారికి మంచిది కాదని వార్నింగ్ ఇస్తున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పడుతున్న”షడష్టక యోగం” ఉన్న సమయంలో ఆయా రాశుల వాళ్ళు  జాగ్రత్తగా లేకుంటే.. కొత్త కష్టాలు పిడుగులా వచ్చిపడతాయని అంటున్నారు. ఈ యోగం ఒక పెద్ద వ్యక్తి  మరణాన్ని కలిగించడమే కాకుండా, జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుందని చెబుతున్నారు.

షడష్టక యోగం ఎప్పుడు ఏర్పడుతుంది ?

జ్యోతిషశాస్త్రంలో షడష్టకం అనేది చాలా అశుభకరమైన యోగం. జాతకంలో రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆరో, ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు షడష్టక యోగం ఏర్పడుతుంది.షట్ అంటే 6.. అష్ట అంటే 8!! రెండు గ్రహాల మధ్య గ్యాప్ ఆరు లేదా ఎనిమిది ఉంటుందన్న మాట. దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళు దుఃఖం, రోగాలు, అప్పులు, చింతలు, దురదృష్టాలు , బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ALSO READ : Shani Jayanti 2023 : శనిదేవుడిని బర్త్ డే రోజు.. ఇలా ఇంప్రెస్ చేయండి

1. కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు షడష్టక యోగం టైం ముగిసే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి మూడో స్థానంలో షడష్టక యోగం సంభవిస్తుంది. దీనివల్ల ఆస్తి విషయంలో కొన్ని వివాదాలు వస్తాయి. మీరు డబ్బు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడికి సరైన ఫలితం రాదు. విభేదాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం  చాలా ముఖ్యం.

2. సింహం

సింహరాశిని శుభ యోగ కారకంగా పరిగణిస్తారు. శని, అంగారకుడి కలయిక వల్ల  ఏర్పడబోయే షడష్టక యోగం..  సింహ రాశి వారికి జీవితంలో టెన్షన్, సమస్యలను తీసుకొస్తుంది. మీరు కార్యాలయంలో జాగ్రత్తగా పని చేయాలి. మీ ఖర్చులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. మీ చిన్న సోదరులకు కొన్ని సమస్యలు రావచ్చు. వారు వారి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

3. కుంభం

కుంభ రాశికి అధిపతి శని మహారాజు. కుజుడు సంచారంపై ఏర్పడబోయే షడష్టక యోగం.. కుంభ రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. దీంతో ఈ రాశి వాళ్ళు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు.  మీరు  కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. దూకుడు తగ్గించాలి. వైవాహిక జీవితంలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

4. ధనుస్సు

“షడష్టక యోగం” కొనసాగే 50 రోజుల్లో.. ధనుస్సు రాశి వారికి ఎనిమిదో స్థానంలో అంగారకుడు సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు కొన్ని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఖర్చులు పెరగవచ్చు. మానసికంగా కలవరపాటుకు గురికావాల్సి రావచ్చు. మీ పనిలోబ్యాలెన్స్ ను కాపాడుకోండి. భాగస్వామితో కొన్ని విభేదాలు రావచ్చు. ఈ సమయంలో మీరు  పెట్టుబడి నిర్ణయాలకు దూరంగా ఉండాలి.  ఎందుకంటే దాని నుంచి లాభం పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి.