Astrology: మామూలుగా ఆహారం తినే సమయంలో చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. అంటే తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడడం, పొట్లాడుకోవడం లాంటివి చేస్తుంటారు. కాగా హిందూ ధర్మం జ్యోతిష్యశాస్త్రంలో ఆహారం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. ఇది శక్తి, సంస్కారం, గ్రహాల సమతుల్యతతో ముడిపడి ఉంటుందట. అందువల్ల ఆహారానికి సంబంధించిన కొన్ని అలవాట్లు గ్రహాల స్థితిపై నేరుగా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అలాగే వాస్తు, జ్యోతిష్యంలో ఆహారం కోసం ఎన్నో నియమాలు ఉన్నాయి.
వంట చేయడం నుంచి తినడం వరకు నియమాలు, దిశలు ప్రత్యేకంగా సూచించారు వాస్తు జ్యోతిష్య శాస్త్ర పండితులు. వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలట. అయినప్పటికీ తెలియకుండానే మనం కొన్ని తప్పులు చేస్తాం. ఇది ఆరోగ్యంపైనే కాకుండా గ్రహాల స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. ఆహారం తీసుకునేటప్పుడు, మనకు కొన్నిసార్లు నీరు, కొన్నిసార్లు మిరపకాయలు, కొన్నిసార్లు ఊరగాయలు, కొన్నిసార్లు ఉప్పు అవసరం అవుతుంది. అవన్నీ అడిగి వేయించుకుంటాం. కానీ జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెబుతున్నారంటే భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగకూడదట.
భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగడం అనే చిన్న అలవాటు మీ జాతకంలో గ్రహాలను అసమతుల్యం చేసి సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. మీరు భోజనం చేసేటప్పుడు ఉప్పు అడిగితే ఇది చంద్రుడు , శుక్రుడు వంటి గ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తుందట. తెలుపు రంగు ఉప్పు చంద్రుడు, శుక్ర గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుందట. అందువల్ల, ఉప్పు ఆహారంలో రుచిని పెంచడమే కాకుండా మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. భోజనం చేసేటప్పుడు ఉప్పు అడగడం మానసిక అస్థిరతకు సంకేతం. అలాగే తరచుగా అలా చేసేవారికి భౌతిక సుఖాలు తగ్గుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా జ్యోతిష్యంలో ఎక్కువ ఉప్పు తినడం వల్ల సూర్య గ్రహం బలహీనంగా ఉండటానికి సంకేతం అని నమ్ముతారు.
దీనికి కారణం ఏంటంటే, సూర్యుడు అగ్ని మూలకం కలిగిన గ్రహం, ఇది ఆత్మవిశ్వాసం, శక్తి, నాయకత్వం, తేజస్సు , ప్రతిష్టకు కారకంగా పరిగణిస్తారు. అదే సమయంలో ఉప్పు భూమి, నీటి మూలకాలతో ముడిపడి ఉంటుందట. దానిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో బద్ధకం, సోమరితనం, నీటి మూలకం పెరుగుతుందట. శరీరంలో నీటి మూలకం పెరిగినప్పుడు, అగ్ని మూలకం బలహీనపడుతుందట. అందుకే ఎక్కువ ఉప్పు తినడం వల్ల వ్యక్తి యొక్క తేజస్సు నిర్ణయాధికారం ప్రభావితమవుతుందని చెబుతున్నారు.
Astrology: ఏంటి.. భోజన సమయంలో ఉప్పు అడగకూడదా.. గ్రహాల కోపానికి గురికాక తప్పదా?

Astrology