Ratna Bhandar : రత్న భాండాగారంలోని మరో రహస్య గదిని తెరిచేది రేపే

రత్న భాండాగారం.. ఇటీవలే దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఒడిశాలోని పూరీలో(Puri) ఉన్న జగన్నాథుడి ఆలయంలో ఇది ఉంది.

Published By: HashtagU Telugu Desk
Ratna Bhandagar Puri Jagannath Temple

Ratna Bhandar : రత్న భాండాగారం.. ఇటీవలే దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఒడిశాలోని పూరీలో(Puri) ఉన్న జగన్నాథుడి ఆలయంలో ఇది ఉంది. ఈనెల 14న  రత్నభాండాగారం తలుపులు తెరిచారు. దీనిలోపల మరో రహస్య గది కూడా ఉంది. ఆ గదిని గురువారం రోజు తెరవనున్నారు.  రేపు ఉదయం 9.51 గంటల నుంచి 12.15 గంటల వరకు శుభ ముహూర్తం ఉందని, ఆ టైంలోనే రహస్య గదిని(Ratna Bhandar) తెరుస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

We’re now on WhatsApp. Click to Join

ఈ నెల 14న రత్న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పూరీ జగన్నాథుడి  సంపదను బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్‌రూంకు తరలించారు. ఇదంతా వీడియోగ్రఫీ చేశారు. ఈనెల 18న రత్నభాండాగారంలోని మరో రహస్య గదిని తెరిచి, అందులోని సంపదను ఇంకో తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తారు. అనంతరం రత్న భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు. మరమ్మతు పనులు పూర్తయ్యాక స్వామివారి సంపదను మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాలను లెక్కించి జమచేస్తారు. మరో రహస్య గది తెరుస్తున్నందున పూరీ జగన్నాథుడి ఆలయంలోకి  గురువారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని ఆపేయనున్నారు.

Also Read :Iranian Plot : ట్రంప్‌‌ హత్యకు ఇరాన్ కుట్ర ? అమెరికా నిఘా వర్గాలకు సమాచారం

పూరీ రాజు కపిలేంద్ర దేవ్‌ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపదను తీసుకొచ్చి పురుషోత్తమునికి మొక్కుగా సమర్పించినట్లు చరిత్రలో ఉంది. ఆ  తర్వాత పురుషోత్తం దేవ్‌ పాలనా కాలంలోనూ స్వామివారికి సంపద సమకూరింది. అప్పట్లోనే రత్న భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలను భద్రపర్చడానికి రహస్య గదిని నిర్మించారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలను దాచారు. ఇతర రాజ్యాల వారు దండయాత్ర చేసినప్పుడు స్వామివారి సంపదను దోచుకోకుండా.. ఆనాడు రహస్య గదులు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని రత్నభాండాగారం లోపలికి పంపించగా.. అతడు తిరిగి రాలేదని పలువురు చరిత్రకారులు రాశారు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన బ్రిటీష్ పాలకులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారని వారు పేర్కొన్నారు.

Also Read :13 Indians Missing : ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 13 మంది భారతీయులు గల్లంతు

  Last Updated: 17 Jul 2024, 08:31 AM IST