Site icon HashtagU Telugu

Prabodhini Ekadashi : ఇవాళ ‘ప్రబోధిని ఏకాదశి’.. దీని విశిష్ఠత, పూజా విధానం వివరాలివీ

Chalisa

Chalisa

Prabodhini Ekadashi : ఇవాళ (నవంబరు 12) ‘ప్రబోధిని ఏకాదశి’. దీన్నే దేవ ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు.  దేవ శయన ఏకాదశి రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణు భగవానుడు .. ప్రబోధిని ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే ప్రబోధిని ఏకాదశి ప్రత్యేకమైన రోజు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యపై శయనించారు.

కదంబ వృక్షం కింద..

ఈరోజున కొన్ని నియమాలను పాటిస్తే విష్ణు భగవానుడి  అనుగ్రహాన్ని భక్తులు పొందొచ్చు. కదంబ వృక్షం దేవతా వృక్షం. విష్ణు భగవానుడి  అవతారమైన శ్రీకృష్ణుడికి కదంబ వృక్షం లేదా కడిమి చెట్టు అంటే చాలా ఇష్టం. శ్రీ కృష్ణుడి కోసం గోపికలు వెతుకుతుండగా.. ఆయన కదంబ వృక్షం కింద వేణువు వాయిస్తూ కనిపించారట. అందుకే ప్రబోధిని ఏకాదశి(Prabodhini Ekadashi) నాడు కదంబ వృక్షానికి పూజలు చేస్తారు. కదంబ వృక్షానికి కొద్దిగా పసుపు, కొన్ని పువ్వులతో పూజ చేయాలి. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.

Also Read :Bitcoin Price : రేటుకు రెక్కలు.. ఒక్క బిట్ కాయిన్ రూ.75 లక్షలు

పూజా విధానం ఇదీ..