Shani Puja: ఈ రాశుల వారు ఇవాళ తప్పనిసరిగా శనిదేవుడిని పూజించాలి…అన్ని శుభాలే..!!

ఇవాళ శనిత్రయోదశి. జ్యోతిషశాస్త్రంలో శనిత్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు శనిదేవుడికి పూజచేస్తే...దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 01:03 PM IST

ఇవాళ శనిత్రయోదశి. జ్యోతిషశాస్త్రంలో శనిత్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు శనిదేవుడికి పూజచేస్తే…దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. మరి ఇవాళ ఏయో రాశులవారు తప్పనిసరిగా శనిపూజ నిర్వహించాలో తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం…శనివారం శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. శనిని న్యాయ దేవుడిగా భావిస్తుంటారు. వ్యక్తులను కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు శనిదేవుడు. శనిదేవుడి అనుగ్రహం ఉంటే…ఆ వ్యక్తుల జీవితమే మారుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా కలిసి వస్తుంది. సుఖసంతోషాలతో ఉంటారు.

ఇవాళ శనివారం…అందులోనూ శనిత్రయోదశి. ఆ శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానిక ఇంతకన్నా మంచి రోజు ఇంకోటిఉండదు. శనిదోషం ఉన్నవారు ఇవాళ తప్పనిసరిగా శని దేవుడిని పూజించాలి. శనిదేవుడికి పూజలు చేసినవారి కష్టాలు తొలగిపోతాయి. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 29ఏప్రిల్ 2022న మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. శని రాశి మార్పుతో కొన్ని రాశుల మీద శని సడేసతి ప్రారంభమవుతుంది. అందుకే ఆయా రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుంభ,మకర, మీన రాశుల వారికి ఏలినాటి శన నడుస్తోంది. ఏలినాటి శనివల్ల బాధలు తప్పవు. కర్కాటక, వృశ్చిక రాశి వారిపై కూడా ఏలినాటి ప్రభావం ఉంది. అందువల్ల ఈ ఐదు రాశుల వారు ఇవాళ శనిదేవుడిని పూజించాలి. శని దోషం తగ్గుతుంది.

శనివారం సూర్యాస్తమయం తర్వాత…రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం నాడు హనుమాన్ ను ఆరాధిస్తే…శనిదేవుడు శాంతిస్తాడని పురాణాల్లో ఉంది. బజరంగబలి భక్తులను తాను ఎప్పుడూ వేధించనని శనిదేవుడు హనుమంతుడికి వాగ్దానం చేశాడని పురాణాల ప్రకారం చెబుతుంటారు. అందుకే శని దోషాలు తొలగేందుకు హనుమంతుడిని పూజించాలి.

ఆ శనిదేవుడి ఆశిస్సులు ప్రసన్నం కావాలంటే శనివారం నాడు రావి చెట్టుకు నీటిని సమర్పించి…చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. పేదవారికి దానం చేయాలి. ఇలా చేస్తే శని దోషం తొలగిపోయి…శుభాలే కలుగుతాయట.