ఈ ఏడాది మే 16న శని జయంతి వస్తుంది. శనిదేవుడు అమావాస్యనాడు జన్మించాడు. శని జయంతి సందర్భంగా శనిదేవుని అనుగ్రహం పొందేలా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు కొన్ని పనులు చేయాలి. శనిదేవుని అనుగ్రహంతో అన్ని కార్యాలు ఫలిస్తాయి, బాధ తొలగిపోతుంది. పూజతోపాటు శని జయంతి నాడు దానం కూడా చేయవచ్చు. ఈ రోజు మీ రాశిని బట్టి వస్తువులను దానం చేస్తే మంచిది. శని జయంతి నాడు రాశి ప్రకారం చేయాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం.
- మేషరాశి: మేషరాశి వారు ఆవనూనె, నల్లనువ్వులు దానం చేస్తే మంచిది.
- వృషభ రాశి: ఈ రాశి వారు శని జయంతి రోజున నల్ల దుప్పట్లు దానం చేయాలి.
- మిథున రాశి: ఈ రాశి వారు నల్లని వస్త్రాలు దానం చేయాలి.
- కర్కాటక రాశి: పెసరపప్పు, నల్ల నువ్వులు, ఆవ నూనె దానం చేయాలి.
- సింహరాశి: ఈ రాశి వారు ‘ఓం వరేణాయ నమ:’ మంత్రాన్ని జపించండి.
- కన్యా రాశి: నల్ల గొడుగు, తోలు పాదరక్షలను దానం చేయండి.
- తులా రాశి, వృశ్చిక రాశి: నల్లని వస్త్రాలు, నల్ల గొడుగు, ఆవాల నూనె, ఇనుము దానం చేయండి.
- ధనుస్సు రాశి: ‘ఓం ప్రాం ప్రిం ప్రౌం సః శనయే నమః’ అనే మంత్రాన్ని జపించాలి.
- మకరరాశి: జంతువులు, పక్షులకు ధాన్యం, నీరు ఇవ్వాలి.
- కుంభ రాశి: మందులు
- మీన రాశి: ఆవాల నూనె, నల్ల నువ్వులు, మందులు మొదలైనవి దానం చేయండి.
