Sheetala Saptami: మార్చి 14న శీతల సప్తమి.. ప్రత్యేక పూజలతో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి

హిందూ మతం ప్రకారం శీతల దేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఒకటో శీతల సప్తమి ఫాల్గుణ

హిందూ మతం ప్రకారం శీతల దేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఒకటో శీతల సప్తమి (Sheetala Saptami) ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షంలో సప్తమి రోజున, రెండోది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది. ఈవిధంగా ఏటా రెండు సార్లు శీతల సప్తమి వస్తుంది. ఏటా హోలీ తర్వాత ఏడో రోజు నాడు శీతల సప్తమి జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ మార్చి 8వ తేదీన వస్తోంది. హోలీ తర్వాత ఏడో రోజు శీతల సప్తమి జరుపుకుంటారు. అంటే మార్చి 14న శీతల సప్తమి వస్తోంది.

ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో శీతల సప్తమిని ఘనంగా జరుపుకుంటారు. సౌతిండియా లోని పలు ప్రాంతాల్లో పోలేరయమ్మ, మారియమ్మ పేర్లతో కొలుచుకుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. శీతల సప్తమి (Sheetala Saptami) రోజున శీతల దేవతను పూజించడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు. అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

శీతల సప్తమి (Sheetala Saptami) ప్రాముఖ్యత:

శీతల దేవిని ఆరాధించడం వల్ల తట్టు, మశూచి, కలరా, కంటి వ్యాధులు రావని, వచ్చిన వారికి త్వరగా తగ్గిపోతాయని భక్తుల నమ్మకం. శీతల దేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లోని కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. శాంతి నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.

శీతల సప్తమి (Sheetala Saptami) రోజున..

శీతల సప్తమి రోజున ముందు రోజు వండిన ఆహారాన్ని శీతల దేవికి నైవేద్యంగా పెడతారు. శీతల సప్తమి రోజు ఇంట్లో పొయ్యి వెలిగించరు. ఎలాంటి వంటకాలు చేయరు. ముందు రోజు వండి పెట్టుకున్న ఆహారాన్ని ఈ రోజున తింటారు. శీతల అమ్మావారి అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం శీతల సప్తమి రోజుల్లో శీతల దేవిని పూజిస్తారు.

శీతల సప్తమి (Sheetala Saptami) ఆచారాలు:

  1. శీతల సప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేస్తారు.
  2. అనంతరం శీతల దేవి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు శీతల దేవతకు ప్రార్థనలు చేస్తారు.
  3. పూజాది కార్యక్రమాల్లో భాగంగా శీతల వ్రత కథను చెప్పుకుంటారు.
  4. కొంత మంది ఈ రోజు శీతల దేవికి వెంట్రుకలు సమర్పించుకుంటారు.
  5. శీతల సప్తమి ముందు రోజే వంటలు వండుతారు.
  6. శీతల సప్తమి రోజు పొయ్యి వెలిగించరు. ముందు రోజు వండి పెట్టిన వాటినే తింటారు.
  7. శీతల సప్తమి రోజు వేడి వేడి ఆహార పదార్థాలు తినరు.
  8. కుటుంబసభ్యుల ఆరోగ్యం కోసం శీతల సప్తమి రోజు ప్రత్యేక పూజలు చేస్తారు.

Also Read:  Chicken: చికెన్‌ ఇలా వండుకుని తింటే బరువు తగ్గుతారట..