ఉగాది (Ugadi ) పండుగను హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది కొత్త సంవత్సరానికి ప్రారంభదినంగా, కొత్త ఆరంభానికి సంకేతంగా ఉంటుంది. మన సంప్రదాయాల ప్రకారం.. ఈ రోజున ఆధ్యాత్మిక శుద్ధతను పాటించడం ఎంతో ముఖ్యం. అందుకే ఉగాది రోజున కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలను తినకూడదని పెద్దలు సూచిస్తుంటారు. ముఖ్యంగా మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను(Non Vegetarian Food) తీసుకోవడం మంచిది కాదని చెబుతారు. వీటిని తింటే మనస్సు అశాంతిగా మారి, ఆధ్యాత్మికత దూరమవుతుందని నమ్మకం.
10th Exams : పరీక్ష హాల్ లో తనిఖీకి వెళ్లిన అధికారిని కాటేసిన పాము
ఉగాది (Ugadi ) పండుగ నాడు.. పులిసిన ఆహారం తింటే.. శరీరంలో బద్ధకం పెరిగి, కొత్త సంవత్సరం నాడు బద్దకంగా ఉంటారు. ఉగాది అనగానే మనకు గుర్తుకు వచ్చే ఉగాది పచ్చడిలో అన్ని రుచులు సమపాళ్లలో ఉంటాయి. కానీ ఈ రోజున చేదు, పులుపు వంటి రుచులను ఒంటరిగా తినకూడదని పెద్దలు చెబుతారు. జీవితంలో తీపి-చేదులను సమంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి అందిస్తుంది. అందుకే ఒకే రుచిని ఒంటరిగా తీసుకోవడం అసమతుల్యాన్ని సూచిస్తుందని భావిస్తారు.
Ugadi: ఈ ఏడాది ఉగాది పండుగ ఎప్పుడు.. ఏ సమయంలో ఉగాది పచ్చడి తినాలో తెలుసా?
పండుగ రోజున పరిశుద్ధతను పాటించడం వల్ల మనస్సుకు, శరీరానికి, ఆధ్యాత్మికతకు మంచిది. ఉగాది రోజున సాంప్రదాయ వంటకాలైన పులిహోర, పాయసం, ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరానికి పోషణతో పాటు శుభ ఫలితాలు కూడా కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఒక సంవత్సరం మొత్తం సానుకూలంగా కొనసాగాలంటే, పండుగ రోజున పాటించాల్సిన నియమాలు అనుసరించడం ఎంతో ముఖ్యమైనదని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.