Shani Dev: శని దేవునికి ఎంతో ఇష్టమైన ఆ రత్నం దరిస్తే.. లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది?

చాలామంది రంగు రాళ్ళను ధరించడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు. అలా రంగు రాళ్లు

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 06:30 AM IST

చాలామంది రంగు రాళ్ళను ధరించడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు. అలా రంగు రాళ్లు పెట్టుకుంటే జీవితం మారిపోతుంది అని వారికి నచ్చిన విధంగా అలాంటి రింగులను అటువంటి రంగురాళ్లతో ధరిస్తూ ఉంటారు. అయితే మీ జాతకం కుండలిలో గ్రహాల సానుకూల ప్రభావం పెంచేందుకు, ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈ రత్నాలు ధరించడం మంచిది. అయితే శని దేవునికి ఇష్టమైన రత్నాన్ని ధరిస్తే ఆయన అనుగ్రహం ఉండడమే కాకుండా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉంటారట.

ఆ రత్నం మరేదో కాదు నీలం రత్నం. నీల రత్నం అంటే శనీశ్వరునికి ఎంతో ఇష్టమట. శని దేవునికి ఎంతో ఇష్టమైన ఆ నీలం రత్నం చాలా ఖరీదైనది. సామాజిక సేవలు కలిగి ఉండాలి. ఈ నీలం రత్నం ధరించడం వల్ల ఆకాశానికి ఎత్తేయడం లేదంటే కిందపడేయడం రెండూ జరుగుతూ ఉంటాయి. శనిదేవుడు ప్రక్రృతిని ఆధీనంలో ఉంచుకునే భూమి ఆధారిత గ్రహం. నీలం రత్నం శనికి చెందిన రత్నం. శనిగ్రహం కిరణాలు నీలం రంగులో ఉంటాయి ఈ రత్నం కూడా నీలం రంగులోనే ఉంటాయి.

ఇకపోతే చాలామంది శనీశ్వరుని పేరు పలకాలి అన్న పూజలు చేయాలన్న భయపడిపోతూ ఉంటారు. అయితే శని దేవుడిని న్యాయదేవుడుగా పిలుస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. శని దేవుడు మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలను ఇస్తాడు. చెడు పనులు చేసే వారికే ఆశుభ ఫలితాలను ఇస్తారు. అలాగే శనీశ్వరుడు జీవితంలో కష్టాల బారిన పడేలా చేశాడు అంటే ఆ తర్వాత అంతకు రెండింతలు ఐశ్వర్యాన్ని అందిస్తాడు.