Site icon HashtagU Telugu

Kumbh Mela 2025 : ఆశ్చర్యపరుస్తున్న సాధువులు

Naga Sadhu Pramod Giri Maha

Naga Sadhu Pramod Giri Maha

మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) కోసం ప్రయాగ్ రాజ్ (Prayag Raj) సిద్ధమవుతోంది. ఈనెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఈక్రమంలో ఇందులో పాల్గొనేందుకు సాధువులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఆలా చేరుకున్న వారు ఎవరికీ వారి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నిన్నంతా 32 ఏళ్లుగా స్నానం (Without bathing for 32 years)చేయకుండా ఉన్న 58 ఏళ్ల గంగాపురి మహారాజ్ అందరి దృష్టినీ ఆకర్షించగా..ఈరోజు మరో సాధువు వార్తల్లో నిలిచారు.

Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. HMRL కీలక నిర్ణయం..

నాగ సాధువు ప్రమోద్ గిరి మహారాజ్ (Naga Sadhu Pramod Giri Maharaj) రోజూ తెల్లవారుజామున 4 గంటలకు 61 కుండల చన్నీటి స్నానం చేస్తున్నారు. హఠయోగా(‘Hatha Yoga’ Ritual in Prayagraj)లో భాగంగా 41 రోజులపాటు ఇలా చేయాల్సి ఉండగా సమయాభావం వల్ల 21 రోజులకు కుదించినట్లు ఆయన తెలిపారు. తొలి రోజు 51 కుండ‌ల చ‌లి నీటితో స్నానం చేశాడు. ఒక స్థ‌లంలో కూర్చున్న త‌ర్వాత‌.. త‌న‌పై మిగితా సాధ‌వులు నీటిని పోస్తార‌ని ఆయ‌న తెలిపారు. రోజు రోజుకీ నీటి కుండ‌ల సంఖ్య పెరుగుతోంద‌న్నారు. ఇవాళ 61 కుండ‌ల నీటితో స్నానం చేశాన‌ని, 21 రోజులు పూర్తి అయితే, అప్పుడు 108 కుండ‌ల నీటితో స్నానం చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

మాన‌వ స‌మాజ సంక్షేమం కోసం చ‌లిస్నానం చేస్తున్న‌ట్లు , దీంట్లో ఎటువంటి స్వార్థం లేద‌న్నారు. స‌నాత‌న ధ‌ర్మ స్థాప‌న కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామ‌న్నారు. ఈ హ‌ఠ‌యోగాను చేయ‌డం ఇది తొమ్మిదో ఏడాది అన్నారు. గురు మ‌హారాజ్ ఆశీస్సులు ఉన్నన్ని రోజులు పుణ్య స్నానం ఆచ‌రిస్తామ‌న్నారు. ఈనెల 14వ తేదీన నాగ‌సాధువులు తొలి ప‌విత్ర సాహి స్నానాలు చేస్తార‌న్నారు. ఆ రోజున స్నానం చేయ‌డం పెద్ద చాలెంజింగ్ ఉంటుంద‌ని, మొద‌ట అకాడా వ‌ద్ద చేసి, ఆ త‌ర్వాత న‌దీలో సాహి స్నానం చేయాల్సి ఉంటుంద‌న్నారు.