Myra Vaikul Video Viral: నా గణపయ్యని తీసుకెళ్లొద్దు: చిన్నారి ఏడుపు

సెప్టెంబర్ మాసంలో వచ్చే గణేష్ ఉత్సవాలు ఊరువాడా సందడిగా జరుపుతారు. తొమ్మిది రోజుల పాటు విగ్నేశరుడిని కొలుస్తారు. విగ్రహ ప్రతిష్ట మొదలుకుని చివరి రోజు వరకు ఎంతో భక్తి శ్రద్దలతో ఆ గణనాధుడిని స్మరిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Myra Vaikul Video Viral

Myra Vaikul Video Viral

Myra Vaikul Video Viral: సెప్టెంబర్ మాసంలో వచ్చే గణేష్ ఉత్సవాలు ఊరువాడా సందడిగా జరుపుతారు. తొమ్మిది రోజుల పాటు విగ్నేశరుడిని కొలుస్తారు. విగ్రహ ప్రతిష్ట మొదలుకుని చివరి రోజు వరకు ఎంతో భక్తి శ్రద్దలతో ఆ గణనాధుడిని స్మరిస్తారు. అయితే కొందరు నిమజ్జనాన్ని సరదాగా జరిపితే మరికొందరు భావోద్వేగానికి లోనవుతారు. తొమ్మిది రోజులపాటు ఇంట్లో ఒకడిగా ఉన్న గణపతి తొమ్మిదవ రోజు తల్లి గంగమ్మ ఒడిలోకి చేరతాడు. అయితే నిమజ్జనానికి తీసుకెళ్లే క్రమంలో కొందరు కన్నీళ్లుపెట్టుకుంటారు. తాజాగా ఓ చిన్నారి గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా గుక్కపెట్టి ఏడ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చైల్డ్ ఆర్టిస్ట్ మైరా వైకుల్ గణపతి బప్పాకు వీడ్కోలు పలికిన వీడియో పర్పుల్ మరాఠీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. గణపతి బప్పాకు వీడ్కోలు చెప్పే ముందు మైరా బప్పా చెవిలో ఏదో గుసగుసలాడుతూ కనిపించింది. ఆ తరువాత, కొంతమంది పిల్లలు బప్పా విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకువెళుతున్నారు. బప్పాకు వీడ్కోలు పలుకుతున్నప్పుడు మైరా ఏడుపు ఆపుకోలేకపోయింది. మైరా తండ్రి ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ వీడియోలో మైరా విపరీతంగా ఏడుస్తూనే ఉంది.

ఈ వీడియోలో మైరా తన ప్రియమైన బప్పాతో, ‘దేవప్ప నన్ను ఎందుకు విడిచిపెట్టాడు? నా మీద నీకు కోపం ఎందుకు? నిజం చెప్పాలంటే, నేను ఇప్పుడు నిన్ను చాలా మిస్ అవుతున్నాను. వచ్చే ఏడాది నేను నీకు చాలా లడ్డూతినిపిస్తాను. నువ్వు తొందరగా రా. నీ కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ మైరా చెప్పిన మాటలు నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బప్పాకు వీడ్కోలు చెబుతూ మైరా ఉద్వేగానికి లోనైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైరా ఏడుపు చూసిన కొందరు కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు.

Also Read: iPhone Screen Distance: స్మార్ట్‌ఫోన్‌ నుంచి మయోపియా ప్రమాదం.. ఐఫోన్ సరికొత్త టెక్నాలజీ

  Last Updated: 24 Sep 2023, 12:00 PM IST