Mount Kailash – India Road : చైనాకు చెక్.. ఇక కైలాసానికి ఇండియా రోడ్

శివ భక్తులకు శుభవార్త. త్వరలో మనం కైలాస పర్వత (Mount Kailash) దర్శనానికి చైనా రూట్ నుంచి కాకుండా నేరుగా ఇండియా నిర్మించిన రోడ్డు మార్గంలోనే  వెళ్లొచ్చు.

Published By: HashtagU Telugu Desk
Mount Kailash India Road

Mount Kailash India Road

Mount Kailash – India Road : శివ భక్తులకు శుభవార్త. త్వరలో మనం కైలాస పర్వత దర్శనానికి చైనా రూట్ నుంచి కాకుండా నేరుగా ఇండియా నిర్మించిన రోడ్డు మార్గంలోనే  వెళ్లొచ్చు. ఇప్పటిదాకా కైలాస దర్శనం కోసం చైనాకు వెళ్లాల్సి వచ్చేది. ఇక ఆ  అవసరం ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉన్న నాభిధాంగ్ వద్ద KMVN హట్స్ వద్ద నుంచి ఇండియా-చైనా బార్డర్ లోని లిపులేఖ్ పాస్ వరకు కొత్త రోడ్డు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత  లిపులేఖ్ పాస్  నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని కైలాసానికి ట్రావెల్ చేయొచ్చు.

పితోర్‌గఢ్ జిల్లాలోని KMVN హట్స్ వద్ద నుంచి ఇండియా-చైనా బార్డర్ లోని లిపులేఖ్ పాస్ వరకు రోడ్డును భారత రక్షణ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ప్రస్తుతం నిర్మిస్తోంది. హిరాక్ ప్రాజెక్ట్‌ సంస్థ చేపట్టిన ఈ రోడ్డు పనులు..  సెప్టెంబరు నాటికి పూర్తవుతాయని (Mount Kailash – India Road) అధికారులు తెలిపారు. దీంతో మన దేశం నుంచే శివుని నివాసంగా భావించే కైలాస పర్వతాన్ని సందర్శించే ఛాన్స్ దక్కుతుంది.

Also read : Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సామజవరగమన, స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

“మేము KMVN హట్స్ నుంచి నాభిధాంగ్‌లోని లిపులేఖ్ పాస్ వరకు దాదాపు  ఆరున్నర కిలోమీటర్ల రహదారిని కత్తిరించే పనిని ప్రారంభించాము. రోడ్డు పనులు పూర్తయిన తర్వాత ఇండియా నుంచే  కైలాస పర్వతం (Mount Kailash) వ్యూ పాయింట్ రెడీ అవుతుంది” అని BRO చీఫ్ ఇంజనీర్ విమల్ గోస్వామి వెల్లడించారు. గతంలో కరోనా మహమ్మారి కారణంగా లిపులేఖ్ పాస్ ద్వారా కైలాస్- మానస సరోవర్ యాత్ర వాయిదా పడింది. ఇది  మళ్ళీ ఈ ఏడాది సెప్టెంబర్ లోనే యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also read : Elon Musk Wealth: ఎలాన్ మస్క్ సంపదలో భారీ క్షీణత.. ఒక్కరోజే 18.4 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి..!

  Last Updated: 21 Jul 2023, 01:46 PM IST