చాలామంది నరదృష్టి సమస్య విధిస్తోంది నరదృష్టి సమస్య ఇబ్బంది పెడుతోంది అని అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో ఈ దృష్టి బారిన పడుతూ ఉంటారు. దీని కారణంగా లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఈ దిష్టి బారిన పడిన వారు తప్పకుండా దాని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అని అంటూ ఉంటారు. లేదంటే అది ఆ వ్యక్తిపై లేదంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబంపై జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దిష్టి తగలడం వల్ల ఎంతవారైనా అనేక ఇబ్బందుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా ధనవంతులు కూడా ఈ సమయంలో అనేక దీర్ఘకాలిక సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని బారి పడకుండా ఉండాలని కోరుకోవాల్సి ఉంటుంది. కన్ను, నర దిష్టి ఉన్నవారు ఎలాంటి పనులు తలపెట్టిన దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఇతర దిష్టిలు కూడా అనేక సమస్యలకు దారి తీస్తాయి. ముఖ్యంగా ప్రతి రోజు ‘ఓం తత్పురుషాయ విఘ్న హే అనే మంత్రాన్ని రోజు పఠించడం వల్ల అనేక రకాల దిష్టిల నుంచి విముక్తి కలుగుతుందట. అంతేకాకుండా ఇంట్లో ఉండే దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.
ఇంటి ముందు కను దిష్టి యంత్రాన్ని అని పెట్టుకోవడం వల్ల సులభంగా ఈ దిష్టి నుంచి విముక్తి పొందవచ్చు. ఈ కను దిష్టి యంత్రాన్ని ఇంట్లో ఉత్తర దిశగా ఉంచుకోవాలని చెబుతున్నారు. కొంచెం పటికని తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి దానిని ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల నరదృష్టి వంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చట. స్పటిక కింద మనం ఇంట్లోకి బయటకి వెళుతూ ఉండడం వల్ల మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఈ స్పటిక తీసుకుంటుందని అప్పుడు ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీలు ప్రవేశించమని చెబుతున్నారు.