Names: ఈ ఊరిలో ఎక్కువగా ఈ పేర్లే ఉంటాయి.. ఇంతకీ ఆ ఊరేంటి? ఆ పేర్లేంటి?

తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల భక్తులూ ఈ సాంప్రాదాయాన్ని పాటిస్తున్నారు. పేదోల్లకు పెద్దదిక్కుగా నిలిచే వేములవాడ రాజన్న విషయంలో తరతరాలుగా

ఎక్కడ మొక్కులు తీర్చుకోవాలన్నా ఇక్కడ దర్శనం చేసుకునే ఆనవాయితీ తరతరాలుగా కొనసాగుతోంది. మేడారం సమ్మక్క, సారలక్క అయినా.. తిరుపతి వెంకన్న అయినా..శ్రీశైలం మల్లన్న అయినా ఇలా ఏ గుడికి వెళ్లిన ముందుగా కోడెమొక్కుల వాడి సన్నిధికి వెల్లి దండం పెట్టి అనుమతి తీసుకుంటుంటారు భక్తులు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల భక్తులూ ఈ సాంప్రాదాయాన్ని పాటిస్తున్నారు. పేదోల్లకు పెద్దదిక్కుగా నిలిచే వేములవాడ రాజన్న విషయంలో తరతరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. అయితే రాజన్న వెలిసిన ఈ పట్టణంకు ఓ స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఉండే వాళ్ల పేర్లు (Names) ఎక్కువగా శ్రీనివాసులే అని పెట్టుకుంటారట.

ఏడు కొండలపై వెలిసిన శ్రీనివాసున్ని తల్చుకుంటూ ఇక్కడ జీవిస్తుంటారట. కాస్తా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఇది అక్షరాల నిజం. దక్షిణ కాశీగా విరుజిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం చాళుక్యుల కాలంలో రాజధానిగా వెలుగొందింది. శ్రీ రాజ రాజేశ్వరుని రూపంలో ఇక్కడ వెలిసిన భోళా శంకరుడు భక్తులకు కొంగుబంగారమై నిలుస్తుంటారని ప్రతీతి. మహిమాన్వితుడైన శివయ్య సన్నిధిలో జీవిస్తున్న వారు మాత్రం నిత్యం తిరుపతి వెంకన్న పేరునే తల్చుకుంటుంటారు. వెంకటేశ్వరునికి వివిధ పేర్లలో శ్రీనివాసుడు ఒకటి కాగా వేములవాడలో పుట్టిన వారిలో చాలా మందికి ఈ పేరు పెట్టుకుంటుంటారు. తిరుపతి, శ్రీనివాస్, రాజయ్య ఈ మూడు పేర్లు పెట్టుకున్న వారు వేములవాడలో ఎక్కువగా కనిపిస్తుంటారు. 60 శాతానికి పైగా ఈ పేర్లే గల వారే ఉండడం గమనార్హం.

పట్టణంలో నివసిస్తున్న వారిలో 50 నుండి 60 శాతం మంది పేర్లు (Names) శ్రీనివాస్ లేదా తిరుపతి అలాగే రాజయ్య అనే ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో నిత్యం శ్రీనివాసుని నామస్మరణ ఈ రకంగా జరుగుతూనే ఉంటుందట. అయితే వేములవాడలో ఉన్న వారిలో చాలా మంది కూడా ఏడుకొండలపై వెలిసిన వెంకన్నను స్మరించుకుంటూ జీవించడం వెనక అసలు కారణం ఏంటన్న విషయంపై వివిధ రకాలుగా చెప్తున్నారు. అల్లంత దూరాన వెలిసిన తిరుపతి వెంకన్న పేరు పెట్టుకుని తమ వారసులకు మంచే జరుగుతుందన్న నమ్మకం కొందరిది. తరతరాలుగా శ్రీనివాసుని పేరు పెట్టుకోవడం ఆచారంగా వస్తుందని మరికొందరు చెప్తుంటే, కలియుగ అవతారం అయిన వెంకన్న స్మరణ మాత్రం వేములవాడ రాజన్న సన్నిధిలో నిత్యకృత్యమనే చెప్పాలి. ఏది ఏమైనా ఆదిభిక్షువు వెలిసిన చోట శ్రీనివాస్, తిరుపతి అనే పేర్లతో ఎక్కువ మంది ఉండడం మాత్రం ఇక్కడ వైవిద్యతను చాటుతోందని చెప్పక తప్పదు.

ఇలాగే కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గంగరాజు, గంగయ్య, గంగ జమున, గంగ అనే పేర్లతో దాదాపు 30 నుండి 40శాతం ఈ పేర్లతోనే ఎక్కువగా ఉంటారు. కారణం ఏమిటంటే ఇక్కడ కాకతీయ రాజుల కాలంలో ప్రతాపరుద్రుని మంత్రివర్గంలో ఒకరైన గంగాధర్ అనే చాణుక్యుడు గంగాధర గ్రామానికి పూర్వంలో పరిపాలించడట అలా ఆ గ్రామానికి గంగాధర అనే పేరు వెలిసిందట. అతని జ్ఞాపకార్థమే చాలా మందికి గంగాధర, గంగయ్య, గంగా, గంగ జమున అనే పేర్లు పెడుతున్నారట.

Also Read:  Pawan Kalyan: జగన్ పై మారిన పవన్ మనసు, విశాఖ సదస్సుపై ట్వీట్ దుమారం