Site icon HashtagU Telugu

Clove: లవంగాలతో ఆర్థిక ఇబ్బందులకు చెక్.. ఏం చేయాలంటే?

Clove

Clove

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. ఆ పరిహారాలను పాటించడం వల్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. అయితే లవంగం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తుంది అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా చాలామంది ఎటువంటి పనులు మొదలుపెట్టిన కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. దాంతో నిరాశ చెందుతూ ఉంటారు. మొదలు పెట్టిన పనులు జరగకపోగా వాయిదాలు పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

అలాంటి సమయంలో నిరాశ చెందకుండా ఇంట్లోంచి బయటకు పనిమీద వెళుతున్నప్పుడు నోట్లో లవంగం ఉంచుకొని బయలుదేరాలి. అయితే మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడికి చేరే ముందు వాటిని బయటకు తీసి పారేయాలి. అలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులు వెళ్లిన పనులు సక్సెస్ఫుల్ గా పూర్తి అవుతాయి. ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న వారు ఏ పని మొదలుపెట్టినా కూడా అంతంత మాత్రమే సాగడం దానికి తోడు మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో చిన్న పరిహారం పాటిస్తే చాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.

శుక్రవారం రోజు గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించాలి. తరువాత 5 లవంగాలను ఐదు రూపాయి బిళ్ళలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి వాటిని మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి. దీనిని భక్తిశ్రద్ధలతో నమ్మకంతో చేయడం వల్ల తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది. జాతకంలో కాల సర్ప దోషంతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు లవంగంతో చిన్న పరిహారం పాటిస్తే చాలు మంచి ఫలితాలు కనిపిస్తాయి. శుక్లపక్షంలోని సోమవారం రోజున శివలింగానికి రెండు లవంగాలు సమర్పించాలి. ఇలా 40 రోజులపాటు వరుసగా చేయడం వల్ల కాల సర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. 40 రోజుల తర్వాత నుంచి మీకు మార్పు కనిపిస్తుంది.

Exit mobile version