Marriage Prediction 2025 : 2024 సంవత్సరంలో చాలామందికి సంబంధించిన వివాహ ప్రయత్నాలు బెడిసికొట్టి ఉంటాయి. అలాంటి వారు కొంత ఆవేదనకు లోనవుతుంటారు. కనీసం 2025 సంవత్సరంలోనైనా తమకు పెళ్లి జరుగుతుందనే పాజిటివ్ ఆటిట్యూడ్‌తో కాలం వెళ్లదీస్తుంటారు. రాబోయే నూతన సంవత్సరంలో తమకు శుభాలు కలగాలని మనసారా ఆకాంక్షిస్తుంటారు. వాళ్ల ఆకాంక్షలు పూర్తి కావాలంటే గ్రహాలు, రాశులు కూడా కలిసి రావాలని పండితులు చెబుతున్నారు. కొన్ని రాశులలోని అవివాహితులకు వచ్చే సంవత్సరంలో పెళ్లి యోగం ఉందని అంటున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
Also Read :ChatGPT On Whatsapp: వాట్సాప్‌లోనూ ‘ఛాట్ జీపీటీ’.. ఎలా వాడుకోవాలో తెలుసా ?
- ధనస్సు రాశికి చెందిన అవివాహితులకు పెళ్లి రోజులు దగ్గరపడ్డాయి. నూతన సంవత్సరంలో వాళ్లకు వివాహ ఘడియలు ఉన్నాయి. కుజుడు, గురు గ్రహం ఎఫెక్టు వల్ల ఈ రాశిలోని వారికి మ్యారేజ్ సెట్ అవుతుంది. పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు ఫాస్టుగా కలిసొస్తాయి. మంచి కట్నకానుకలు కూడా దొరుకుతాయి.
- వృషభ రాశిలోని అవివాహితులకు కూడా 2025లో వివాహ యోగం ఉంది. ఈ రాశిలోని వారు ఒకవేళ ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. అది పెళ్లిగా మారే ఛాన్సు కూడా ఉంది. ప్రేమించిన వాళ్లనే పెళ్లి చేసుకునే ఛాన్సు అంటే చాలా గొప్ప లక్కు. వీరి కోసం పెళ్లి సంబంధాలు వెతికినా ఫాస్టుగా మంచి సంబంధాలు దొరికిపోతాయి. ఇందుకోసం శని , బృహస్పతి గ్రహాలు సహకరిస్తాయి. పెళ్లి సంబంధాలు కుదరడంలో కొందరు స్నేహితులు, బంధువులు హెల్ప్ చేస్తారు.
- వృశ్చిక రాశిలోని(Marriage Prediction 2025 )అవివాహితులు ఓ ఇంటివారు అవుతారు. సమీప బంధువుల నుంచే మంచి పెళ్లి సంబంధం వస్తుంది. మీకు నచ్చిన పెళ్లి సంబంధమే సెట్ అవుతుంది. ఎవరి నుంచీ ఆటంకం ఎదురుకాదు. ఇందుకోసం మీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. 2025 సంవత్సరం మే నెలలోగా ఈ రాశిలోని వారికి పెళ్లి కుదిరేందుకు మంచి టైం. ఆలోగా పెళ్లి ప్రయత్నాలు చేస్తే.. పాజిటివ్ ఫలితాలు వస్తాయి.
- కన్యా రాశిలోని అవివాహితులకు మ్యారేజ్ సెట్ అవుతుంది. పెళ్లి కోసం వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుంది. కోరుకున్న జీవిత భాగస్వామి దొరుకుతారు. పెళ్లి సంబంధం కుదరడంలో మీ కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషిస్తారు. మీకు వచ్చే పెళ్లి సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. గ్రహాలు అనుకూలించి మీ పెళ్లికి లైన్ క్లియర్ చేస్తాయి.
Also Read :Konapapapeta : సముద్రంలో మునిగిపోతున్న కోనపాపపేట.. ఇప్పటికే వందలాది ఇళ్లు మాయం
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.