Site icon HashtagU Telugu

Ram Mandir: భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదుకలు ప్రయాణం.. వాటి ధర తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే?

Mixcollage 11 Jan 2024 06 34 Pm 2234

Mixcollage 11 Jan 2024 06 34 Pm 2234

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం అందరి చూపు కూడా అయోధ్య రామ మందిరం పైనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈనెల 22వ తేదీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా వందల సంవత్సరాల నాటి కల నెరవేరుతున్నందుకు శ్రీరాముని భక్తులు అలాగే హిందువులు ఆ మంచి గడియల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక రాముడి పై ఉన్న భక్తితో భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు స్వామివారికి విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. కొందరు స్వామి వారికి తోచిన విధంగా డబ్బు సహాయం చేస్తుండగా మరి కొందరు వస్తువుల రూపంలో సహాయం చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కూడా అయోధ్య రామ మందిరం కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా జనవరి 22 న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన 64 ఏళ్ల వ్యక్తి చల్లా శ్రీనివాస్ శాస్త్రి, దేవుడికి బంగారు పూత పూసిన జత చెప్పులను సమర్పించడానికి అయోధ్యకు కాలినడకలన వెళ్లేందుకు సంకల్పించారు. దాదాపు 7,200 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. ఆయన అయోధ్య-రామేశ్వరం మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో శ్రీరాముడు తన వనవాసం సమయంలో అనుసరించిన మార్గాన్ని ఎంచుకున్నారు.

అయితే శ్రీరాముడు అయోధ్య నుంచి రామేశ్వరం చేరుకుంటే, శాస్త్రి మాత్రం శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగాన్ని దర్శించి జులై 20న తన నడకను ప్రారంభించానని, రివర్స్‌ ఆర్డర్‌లో యాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. జనవరి 15న అయోధ్య చేరుకోవడమే తన లక్ష్యం అని తెలిపారు. జనవరి 16న ఈ చరణ్ పాదుక ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి అందజేస్తానని అన్నారు. జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు అయోధ్యను సందర్శించడం చాలా ఉత్సాహంగా ఉందని అన్నారు. రాముడి చెప్పులకు ప్రత్యేక విలువ ఉందన్నారు. రామాయణం ప్రకారం, శ్రీరాముని సోదరుడు భరతుడు రాజ్యాన్ని పాలించేందుకు గౌరవ సూచకంగా సింహాసనంపై తన అన్న శ్రీరాముని చెప్పులను ఉంచి అయోధ్యను పాలించినట్లు పురాణ ఇతిహాసాన్ని వివరించారు.

 

శ్రీరాముడికి ఇవ్వడానికి నేను ప్రస్తుతం పంచ ధాతు అంటే ఐదు లోహాలతో తయారు చేసిన బంగారు పూతతో కూడిన పాదుకలు అనగా పాదరక్షలు తీసుకువెళుతున్నాను అని చెప్పుకొచ్చారు. తమిళనాడు నుంచి రోజుకు 30 నుండి 50 కి.మీ ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. బంగారు పూత పూసిన చెప్పుల జత విలువ దాదాపు రూ. 65 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా అందులో కొంత భాగాన్ని భక్తులు విరాళంగా కూడా ఇచ్చారని తెలిపారు. అయోధ్య భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శాస్త్రి భవిష్యత్తులో అయోధ్యలో శాశ్వతంగా స్థిరపడాలని కోరుకుంటున్నాట్లు తన అంతరంగాన్ని వివరించారు.

Exit mobile version