Srisailam :12 నుంచి 18 వరకు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 18 వరకు

Published By: HashtagU Telugu Desk
Makara Sankranti Brahmotsavam At Srisailam From 12th To 18th

Makara Sankranti Brahmotsavam At Srisailam From 12th To 18th

శ్రీశైలంలో (Srisailam) ఈ నెల 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రంలో (Srisailam) మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జున స్వామికి ఏటా రెండు సార్లు అనగా సంక్రాంతికి, శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 12 న ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.  బ్రహ్మోత్సవాల భాగంగానే శ్రీస్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండో రోజు నుంచి అంటే ఈనెల 13 నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేషపూజలు, వాహనసేవలు నిర్వహిస్తామని ఈనెల 15 వ తేదీ మకర సంక్రాంతి పురస్కరించుకొని శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం అలాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తునట్లు ఈవో లవన్న తెలిపారు.

ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 18 వరకు ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ స్వామి అమ్మ వార్ల కళ్యాణం, ఏకాంత సేవలు తాత్కాలిక నిలుపుదల చేస్తామని ఆలయ ఈవో లవన్న తెలిపారు. భక్తులకు ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం కొనసాగిస్తోంది.‌ ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ. 7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.12.65 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు.

ప్రముఖ దినాల్లో 3 లక్షల మందికి పైగా:

తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున 3లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు చట్నితో కలిపి ఉప్మా, పొంగళి, సేమ్యా ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగలి, చట్ని, అన్నం, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి రోజుకు 14 నుంచి 16.5 టన్నుల బియ్యం, 6.5 నుంచి 7.5 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు.

Also Read:  Tirumala : ఈ నెల 9న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

  Last Updated: 09 Jan 2023, 12:21 PM IST