Site icon HashtagU Telugu

Bhogi – Horoscope : భోగి రోజు.. మీ రాశిఫలితం ఇదిగో

Bhogi Horoscope

Bhogi Horoscope

మేష రాశి  

Bhogi – Horoscope : ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. వాహన ఆనందం పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. మీ మాటతీరు మెచ్చుకోలుగా ఉంటుంది.

వృషభ రాశి 

మీకు సహనం తగ్గుతుంది. వాహన నిర్వహణకు డబ్బు వెచ్చించాల్సి రావొచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలం. ఉద్యోగంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

మిథున రాశి  

పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి   అవకాశాలు ఉంటాయి.

కర్కాటక రాశి   

తల్లి సహకారంతో ధనలాభం ఉంటుంది. మానసికంగా తీసుకునే నిర్ణయాలు హాని కలిగిస్తాయి. వాహన నిర్వహణకు ధనం వెచ్చించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు కార్యాలయంలో పూర్తి విశ్వాసంతో కనిపిస్తారు.

సింహ రాశి 

కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి, కానీ అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Also Read: Money Doubling : 200 రోజుల్లో డబ్బులు డబుల్.. చీటింగ్ స్కీమ్‌తో కుచ్చుటోపీ !

కన్యా రాశి  

కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. భావోద్వేగాలలో ఒడిదుడుకులు ఏర్పడొచ్చు. కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది. మాటలో కర్కశత్వం ప్రభావం ఉంటుంది. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం ఉండవచ్చు. మీరు అన్ని పనుల్లో ఆశించిన విజయాన్ని పొందుతారు.

తులా రాశి

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కోపాన్ని నివారించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు.  ఉద్యోగంలో మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి

ఆరోగ్యాన్ని  అశ్రద్ధ చేయవద్దు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది..ఖర్చులు కూడా అలానే ఉంటాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలను తెలివిగా తీసుకోండి.

ధనుస్సు రాశి  

ఓర్పుతో మెలగాలి. సంభాషణలో సమతుల్యతతో ఉండండి. కుటుంబంలో ఆర్థిక వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.

మకర రాశి

పాత స్నేహితులను కలుస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. పిల్లల వైపు నుంచి ఇబ్బందులు ఉండవచ్చు. అధిక ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది.  వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కుంభ రాశి  

మీ పని పెరుగుతుంది. కానీ లక్ష్యాలను సాధించడంలో సక్సెస్ అవుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆదాయ వనరులను పొందొచ్చు. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారులు, ఉద్యోగులుకు శుభసమయం.

మీన రాశి  

వృత్తి, ఉద్యోగాల్లో ఉండేవారికి అనుకూల సమయం. వ్యాపారులు నూతన పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కష్టపడి పనిచేయడం ద్వారా మీ లక్ష్యాలను సాధిస్తారు.