Seven Spiritual Cities : మన దేశంలో అనేక పవిత్ర క్షేత్రాలున్నా, పురాణాల ప్రకారం ఏడింటిని ప్రత్యేకంగా “సప్తమోక్షపురి క్షేత్రాలు”గా పేర్కొన్నారు. ఈ క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే, మానవుడు మోక్షాన్ని పొందుతాడని, పునర్జన్మ ఉండదని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. పాండవులు మహాభారత యుద్ధం అనంతరం ఈ క్షేత్రాలను సందర్శించి మోక్షాన్ని పొందారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ క్షేత్రాలలో శైవ, వైష్ణవ భావనలు చెరిపి ఉండగా, అందులోని ప్రతీదీ ఒక అపూర్వత కలిగిన తీర్థం.
1. అయోధ్య (ఉత్తరప్రదేశ్)
ఈ ప్రాంతం శ్రీరాముని జన్మస్థలంగా ప్రసిద్ధి. రామజన్మభూమి అని పిలవబడే ఈ తీర్థం సరయూ నది తీరంలో ఉంది. అధర్వణ వేదం ప్రకారం, స్వయంగా భగవంతుడు నిర్మించిన నగరం ఇది. సాకేతపురం అని పిలువబడే అయోధ్యలో లక్షలాది భక్తులు రోజూ రామదర్శనానికి వస్తుంటారు. అయోధ్యను ఆ భగవంతుడే నిర్మించాడని అధర్వణ వేదంలో ఉంది. దేవుడు నిర్మించిన నగరం కాబట్టే అత్యంత ప్రాధాన్యత కలిగిందని భక్తుల విశ్వాసం.
2. మధుర (ఉత్తరప్రదేశ్)
శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన ప్రదేశం మధుర. గోపికలతో రాసలీలలు, బాలలీలలతో ఈ ప్రాంతం ఎటర్నల్ లవ్ లాండ్ గా పేరొందింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల సమయంలో ఈ క్షేత్రం భక్తుల తాకిడి నుంచి తట్టుకోలేనంత జనసంచారాన్ని చూసి ఆశ్చర్యపోతారు.
3. మాయా/హరిద్వార్ (ఉత్తరాఖండ్)
గంగా తటంలో ఉన్న ఈ ప్రదేశం అమృత ధారాలో ఒక చుక్క పడిన స్థలంగా పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఇది మోక్ష ద్వారంగా భావించబడుతుంది. హరిద్వార్ లో గంగానదిలో స్నానం చేస్తే పాపాలు హరించబడతాయని విశ్వాసం. దీనిని మాయానగరం అని కూడా పిలుస్తారు. సప్తమోక్షపురి క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్. గంగోత్రి వద్ద జన్మించి గంగమ్మ 2543 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హరిద్వార్ లోనే ఉధృతి పెంచుకుంటుంది. అందుకే ఈ ప్రదేశాన్ని గంగాద్వారం అని కూడా పిలుస్తారు.
4. కాశీ/వారణాసి (ఉత్తరప్రదేశ్)
పరమేశ్వరుడే స్వయంగా స్థాపించిన క్షేత్రంగా పురాణాలలో ప్రస్తావన. వరుణ, అసి నదుల సంగమంలో ఉన్న ఈ క్షేత్రాన్ని మృతిక్షేత్రంగా భావించి, ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వనాథ ఆలయం ఇక్కడే ఉంది. 5 వేల ఏళ్ల క్రితం పరమేశ్వరుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ గాథ. శివుడు నివాసం ఉండే ఈ క్షేత్రం నిత్యం భక్తులతో నిండి ఉంటుంది. వారణాసిని మొదట్లో బారణాసి అనేవారు..ఆ తర్వాత అది బనారస్ గా మారింది.
5. కాంచిపురం (తమిళనాడు)
దక్షిణ భారతంలో ఉన్న ఏకైక సప్తమోక్షపురి క్షేత్రం. కామాక్షి అమ్మవారి శక్తిపీఠంతో పాటు, శివుని ఆరాధనకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. దీనిని పంచభూతాల లింగక్షేత్రాలలో భాగంగా కూడా పరిగణిస్తారు. శైవ, శక్తి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రదేశం ఇది.
6. అవంతికా/ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
క్షిప్రానదీ తీరంలో ఉన్న ఈ నగరంలో మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నారు. జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రం మహాశివరాత్రికి ప్రసిద్ధి. శైవ, వైష్ణవ భక్తులకు ఇది మహాపుణ్యక్షేత్రంగా ఉంది. మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణి గణేశ, గోపాల మందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది.
7. ద్వారక (గుజరాత్)
శ్రీకృష్ణుడు పాలించిన పవిత్ర నగరం. గోమతి నది తీరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని “పరబ్రహ్మ సన్నిధి”గా భావిస్తారు. ద్వార అంటే ప్రవేశం, కా అంటే బ్రహ్మ సన్నిధి అని సంస్కృతంలో అర్థం. ద్వారకను మోక్షానికి ద్వారం అనడం అందుకే. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మరొకటి అయిన శ్రీ కృష్ణుడు పాలించిన ప్రాంతం ద్వరాక. మధురను వీడిన తర్వాత దాదాపు వందేళ్లు ద్వారకలోనే ఉన్నాడు కృష్ణుడు. ఈ నదీ తీరంలో ఉన్న ద్వారకలో ఎన్నో ముఖ్యమైన ధార్మిక క్షేత్రాలున్నాయి. ఆది శంకరాచార్యలు స్థాపించిన నాలుగు శారద పీఠాల్లో ఒకటి ద్వారకలోనూ ఉంది.
Read Also: PM Modi : ప్రధాని మోడీ చైనా టూర్..సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత తొలిసారి పర్యటన!