Lady Aghori : శృతిమించుతున్న అఘోరి ఆగడాలు…భక్తులపైకి ఏకంగా కత్తితో..

Lady Aghori : తాజాగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఏకంగా కత్తితో భక్తులపైకి వెళ్లి వారిని పరుగులు పెట్టెల చేసింది

Published By: HashtagU Telugu Desk
Aghori Naga Sadhu Halchal I

Aghori Naga Sadhu Halchal I

గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి అలియాస్ శ్రీనివాస్ విషయం హాట్ టాపిక్‌గా మరీనా సంగతి తెలిసిందే. మొదట్లో అంత ఈమెకు సపోర్ట్ ఇచ్చిన ఆ తర్వాత ఈమె ఆగడాలు శృతిమించుతుండడంతో అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లిన తాను చెప్పినట్లే జరగాలని చెప్పి నానా రచ్చ చేస్తూ వస్తుంది. తాజాగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో (Komuravelli Temple) ఏకంగా కత్తితో భక్తులపైకి వెళ్లి వారిని పరుగులు పెట్టెల చేసింది. మంగళవారం స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమె ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సిబ్బందితో గొడవకు దిగింది.

Samyuktha : సంయుక్తకి బాలయ్య ఛాన్స్.. అలా వచ్చిందా..?

దిగంబరంగా అనుమతి ఇవ్వలేమని, వస్ర్తాలు ధరించి రావాలని ఆలయవర్గాలు సూచించడంతో బయటకు వచ్చి కారులో ఉన్న కత్తి తీసుకుని భక్తులపై దూయడంతో ఒక్కసారిగా వారు పరుగులు తీశారు. పోలీసులు చేరుకుని ఆమెను శాంతింపజేసేందుకు ట్రై చేసారు. అయినప్పటికీ ఆమె వినకుండా ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి తలుపులకు ఉన్న తాళాన్ని పగులగొట్టేందుకు యత్నించి విఫలమయ్యారు. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధిని కత్తితో అడ్డుకోవడంతో సెల్‌ఫోన్‌ పగిలిపోయింది. ఆలయవర్గాల విజ్ఞప్తితో అఘోరి వస్ర్తాలు ధరించి వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళ్ళిపోయింది. ఈమె ఆగడాలు చూసి అక్కడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక సోషల్ మీడియా లోను ఆమె పై విమర్శలు వస్తున్నాయి.

  Last Updated: 29 Jan 2025, 11:30 AM IST