Kitchen: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే వంటగదిని ఇలా ఉంచుకోవాల్సిందే?

ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగది అన్నది తప్పనిసరిగా ఉంటుంది. వంటగదిలేని ఇల్లు దాదాపుగా ఉండదేమో. కొందరు బాగా డబ్బు ఉన్నవారు సపరేట్గా

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 05:06 PM IST

ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగది అన్నది తప్పనిసరిగా ఉంటుంది. వంటగదిలేని ఇల్లు దాదాపుగా ఉండదేమో. కొందరు బాగా డబ్బు ఉన్నవారు సపరేట్గా వంట ఇల్లు ని కట్టించుకుంటూ ఉంటారు. అయితే మామూలుగా వంట గదిని దేవుడి గదిగా భావిస్తారు. శాస్త్రం ప్రకారం దేవుడిగది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతూ ఉంటారు. వంటగది శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతూ ఉంటారు. మరి వంట గది విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి.

వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పోపుల డబ్బాలోని లవంగాలు, మిరియాలు, ఆవాలు, మెంతులు, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇలా మొదలైన ద్రవ్యాలు ఆయుర్వేద పరంగా మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మనకు కలిగే చిన్న చిన్న రోగాలన్నింటినీ తొలగించడానికి ఉపయోగపడుతాయి. కాబట్టి వంటగదిలో ఉండే పోపుల డబ్బాను దివ ఔషధంగా భావిస్తారు. పోపుల పెట్టెలోనీ ద్రవ్యాలు పురుగులు పట్టకుండా జాగ్రత్తపడాలి. పోపుల డబ్బాలోని సుగంధ ద్రవ్యాలకు పురుగులు పడితే అష్టైశ్వర్యాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా వంటగదిలో సింక్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఈ సింక్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.

తిన్న పాత్రలన్నీ సింక్ లో వేసి కడగకుండా అలాగే పడేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. అదేవిధంగా స్టవ్, స్టవ్ వెనకవైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది. కాబట్టి స్టవ్ తో పాటు సింక్, గోడలను శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తుంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం. ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయడం అనేది ఐశ్వర్య క్షయం అని చెబుతారు. గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము, ధూళి, బూజు ఉండరాదు.

అలాగే ముఖ్యంగా బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు కనిపించకూడదు. ఇవి వంట గదిలో కనిపిస్తే ఐశ్వర్యం మీకు ఉపయోగపడకుండా అనారోగ్యాలకు ఉపయోగపడుతుంది. కనుక అవి కనిపించకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వంట గదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండకపోగా ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటాయి.