Site icon HashtagU Telugu

Kanuma : కనుమ రోజు ప్రయాణం చేస్తున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!!

Kanuma

Kanuma

సంక్రాంతి సంబరాల్లో యావత్ తెలుగు ప్రజలు మునిగిపోతున్నారు..గత రెండు రోజులుగా భోగి , సంక్రాంతి పర్వదినాలు జరుపుకున్న ప్రజలంతా ఈరోజు కనుమను జరుపుకుంటున్నారు. అయితే కనుమ ప్రత్యేకతో పాటు కనుమ రోజు ప్రయాణం చేస్తే ఏంజరుగుతుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు.. దీన్నె ‘పశువులు పండగ’ అని కూడా అంటారు. ఏడాది పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే ముగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలా కనుమ ప్రసిద్ధి. ఆ రోజు ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరించి.. వాటినంత మెత్తటి పొడిలాగ చేసి పశువులకు తినిపిస్తారు. అవి పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం.

అలాగే కనుమ రోజు పెద్దలను తలుచుకుంటూ మంసాహారం తింటారు. మాంసాహారం తినని వారికోసం అవే పోషకాలు అందించే మినుము తినాలని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనే సామెత మొదలైంది. కనుమ రోజు పెద్దలకోసం విందుభోజనాలు తయారు చేయడమే కాదు..కుటుంబం మొత్తం కలసి భోజనం చేయాలని చెబుతారు. పొద్దున్నే పశువులను పూజించడం, మధ్యాహ్నం పితృదేవతలకు తర్పణాలు వదలడం చేస్తారు. కొన్ని ఊర్లలో కనుమ రోజు గ్రామదేవతల ఆలయాల వద్ద బలులు ఇవ్వడం, పొంగళ్లు వండడం చేస్తారు. మూడు రోజుల పండుగలో మూడో రోజు కూడా చాలా ముఖ్యం. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అని పెద్దలు చెపుతుంటారు. కాదుకూడదని ఆ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని హెచ్చరిస్తుంటారు. ఏడాదిలో మూడు రోజుల పాటూ సంబరంగా జరుపుకునే ఈ పండుగ రోజు అంతా కలసి ఉండాలనే ఉద్దేశంతో అలా చెపుతుంటారు.

Read Also : HCA : ఈ నెల 18 నుంచి ఉప్ప‌ల్ టెస్టు టిక్కెట్లు అమ్మ‌కం