Kamika Ekadashi : రేపు (జులై 31) కామిక ఏకాదశి. మనసులో మనకు చాలా కోరికలు ఉంటాయి. వాటిని తీర్చే ఏకాదశి కావడంతో దీనికి కామిక ఏకాదశి అనే పేరు వచ్చింది. ఏటా ఆషాఢ అమావాస్యకు ముందు కామిక ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి నియమాలను పాటిస్తే, ఏకాదశి(Kamika Ekadashi) కథ వింటే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన తర్వాత మొదటగా వచ్చే ఏకాదశి కావడంతో దీన్ని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు.
Also Read :August Horoscope : ఆగస్టు నెల రాశి ఫలాలు.. ఆ రాశి వారికి శత్రుగండం
కామిక ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును తులసీదళాలతో పూజిస్తారు. ఒక్క తులసి ఆకుతో విష్ణువును పూజించినా బంగారం, వెండి దానం చేసినంత పుణ్యం లభిస్తుందని అంటారు. ఈ రోజున శ్రీహరిని పూజించేవారికి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుందని విశ్వసిస్తారు. ఈ వ్రతం మహత్మ్యం గురించి ఒకసారి ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా పురాణాల్లో ప్రస్తావన ఉంది. కామికా ఏకాదశి(Sawan) ఉపవాసం చేసేవారు సాత్వికాహారం తినాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై నిద్రపోవాలి. ద్వాదశి రోజు ఉపవాసం విరమించిన తర్వాత పూజ చేయాలి. దానధర్మాలు చేసిన తర్వాతే అన్నం తినాలి.
We’re now on WhatsApp. Click to Join
కామిక ఏకాదశి వ్రతకథ
పూర్వకాలంలో ఓ గ్రామాధికారికి శ్రీ మహావిష్ణువు భక్తుడు. అయితే అతడికి తన బలంపై గర్వభావం ఉండేది. ఓ రోజు ఆ గ్రామాధికారి ఒక బ్రాహ్మణుడితో గొడవపడ్డాడు. గొడవ పెద్దదై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ గొడవ సందర్భంగా గ్రామాధికారి చేసిన దాడిలో బ్రాహ్మణుడు చనిపోయాడు. అనంతరం గ్రామాధికారి తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. తాను చేసిన తప్పును గ్రహించాడు. ఈవిషయంలో ఊరిలోని వారందరికీ తెలిసింది. దీంతో ఊరి వాళ్లకు సారీ చెప్పి.. ఆ బ్రాహ్మణుడి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని ప్రకటించాడు. అయితే పండితులంతా ఆ అంత్యక్రియలకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. ముందుగా కామికా ఏకాదశి వ్రతం ఆచరించి.. బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందమని గ్రామాధికారికి పండితులు సూచించారు. వాళ్లు చెప్పిన విధంగా ఆ వ్రతాన్ని ఆచరించి బ్రహ్మహత్యా పాతకం నుంచి గ్రామాధికారి విముక్తి పొందాడు.