Weekly Horoscope : ఓ రాశి వాళ్లకు ఆర్థిక నష్టాలు.. మరో రాశి వాళ్లకు ఉద్యోగ కష్టాలు

Weekly Horoscope : ఆగస్టు వస్తోంది.. ఈ నెల మొదటి వారంలో(జులై 31 - ఆగస్టు 6) కొన్ని రాశుల వాళ్లకు పనులన్నీ పూర్తవుతాయి. 

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 07:52 AM IST

Weekly Horoscope : ఆగస్టు వస్తోంది.. 

ఈ నెల మొదటి వారంలో(జులై 31 – ఆగస్టు 6) కొన్ని రాశుల వాళ్లకు పనులన్నీ పూర్తవుతాయి. 

ఇంకొన్నిరాశుల వాళ్లకు కొత్త సమస్యలు వస్తాయి.. 

మరికొన్నిరాశుల వాళ్లకు ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి..   

ఏయే రాశుల వారిపై ఆగస్టు మొదటివారంలో ఎలాంటి ప్రభావం పడబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

Also read :   Black Hair: జుట్టు నల్లబడాలంటే.. నెయ్యితో ఇలా చేయాల్సిందే?

మకర రాశి : ఈ వారం(జులై 31 – ఆగస్టు 6)  మకరరాశిలోని విద్యార్థులకు సమయం చాలా ముఖ్యం. మీరు శుభవార్త వినొచ్చు. ఇష్టదైవాన్ని పూజించండి. కొందరి ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.

కుంభ రాశి : ఈ వారం(Weekly Horoscope)  కుంభరాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు జీవిత భాగస్వామి నుంచి సహాయం అందుతుంది. కుటుంబంలో సానుకూలత ఉంటుంది.  ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలను కోల్పోవడం వల్ల ఇబ్బందులు పడతారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం.

మీన రాశి : ఈ వారం మీనరాశి వారు నాలుగు రకాల పనులు ‍ఒకేసారి చేయడం కన్నా.. ఒకే పనిపై శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం ఇది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. శనివారం నాడు పేదలకు దానం చేయండి.

మిథున రాశి : ఈ వారంలో మిథునరాశి వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశిలోని నిరుద్యోగులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. మీ తోబుట్టువుల నుంచి సహకారం పొందుతారు.

కర్కాటక రాశి : ఈ వారం కర్కాటక రాశికి చెందినవారు పార్ట్నర్ షిప్ వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. సన్నిహితుల సూచనలను పరిగణలోకి తీసుకోండి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

Also read :  Underarms: చంకల్లో నలుపు తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే?

సింహ రాశి : ఈ వారం సింహరాశివారు సమాజంలో గౌరవం పొందుతారు. ఎదుటివారిని అర్థం చేసుకునే సామర్థ్యం ఉండడం వల్ల మీకు సన్నిహితులు పెరుగుతారు. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు.

మేష రాశి : ఈవారం  మేషరాశి వారు వ్యాపారాన్ని విస్తరిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. గొప్ప వ్యక్తులను కలుస్తారు.

వృషభ రాశి : ఈవారం వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. వృషభ రాశి విద్యార్థులు ఇబ్బంది పడతారు.

కన్యా రాశి : ఈవారం కన్యా రాశిలోని ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈ రాశివారిలో  క్రియేటివిటీ  పెరుగుతుంది.   ఉన్నత విద్యకు ఇది అనుకూల సమయం.

తులా రాశి  : ఈవారం తులా రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాల్లో  సహనంగా ఉండాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి.

Also read : Sunday Holiday : ఆదివారం జంతువులకు కూడా సెలవు.. ఓ ఆవు కోసం.. ఎక్కడో తెలుసా?

వృశ్చిక రాశి : ఈ వారం వృశ్చిక రాశి వారిపై పని ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులకు ఇది అనుకూల సమయం. మంగళవారం కేతు గ్రహం కోసం యాగం హవనం చేయండి.

ధనుస్సు రాశి : ఈ వారం ధనుస్సు రాశివారు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిసమయం. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వివాహితుల జీవితం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.