Raavi Tree : రావి చెట్టుని అలా పూజిస్తే చాలు.. శని అనుగ్రహం కలగడం ఖాయం?

హిందూ మత విశ్వాసాల ప్రకారం రావి చెట్టుని (Raavi tree) విష్ణువు మరో రూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ చెట్టుకు శ్రేష్ఠదేవ వృక్షం అనే పేరు వచ్చింది.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 02:24 PM IST

భారతదేశంలో హిందువులు రావి చెట్టుని పవిత్రంగా భావించడంతో పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో విశేష పూజలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రావి చెట్టుని (Raavi Tree) పూజించడం వల్ల శనీశ్వరుడు శాంతిస్తాడని విశ్వసిస్తూ ఉంటారు. చాలామంది ఏలినాటి శని నడుస్తోందని, అర్ధాష్ట‌మ శ‌ని ప్ర‌భావం అంటూ రావి చెట్టును పూజలు చేస్తుంటారు. కాగా హిందూ మత విశ్వాసాల ప్రకారం రావి చెట్టు (Raavi Tree)ని విష్ణువు మరో రూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ చెట్టుకు శ్రేష్ఠదేవ వృక్షం అనే పేరు వచ్చింది.

We’re Now on WhatsApp. Click to Join.

రావి చెట్టుకు నమస్కరించి, ప్రదక్షిణలు చేసిన వారికి దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణంలో తెలిపారు. అంతేకాకుండా తరచూ రావి చెట్టు (Raavi Tree)కి నీళ్ళు పోసే వారికి చేసిన పాపాలన్నీ తొలగిపోవడంతో పాటు స్వర్గానికి వెళ్తారని నమ్మకం. రావి చెట్టు త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మ‌హేశ్వ‌రుల నివాసంగా వర్ణించారు. శ్రీ‌ మ‌హా విష్ణువు రావి చెట్టు మూలంలో, శంకరుడు చెట్టు కాండంలో , బ్రహ్మదేవుడు పైభాగంలో ఉంటాడని చెబుతుంటారు. రావి చెట్టును నాటి కాపాడంతో పాటు, రావి చెట్టును స్పర్శించి, విశ్వాసంతో, నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా భక్తులకు సంపద, స్వర్గం మోక్షం లభిస్తాయట.

అలాగే హిందూ సంప్ర‌దాయం ప్రకారం శనిదేవుడు రావి చెట్టులో నివసిస్తాడ‌ని నమ్ముతారు. శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి దాని కింద దీపం వెలిగించిన వారికి ఏలినాటి శని, అర్ధాష్ట‌మ శ‌ని బాధలు ఉండ‌వు. అలాంటి వారికి శనిదేవుని ఆశీస్సులు తప్పక ల‌భిస్తాయి. రావి చెట్టుని పూజించే వారికి శని అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే రావి చెట్టుని క్రమంగా పూజిస్తూ రావి చెట్టుకి నీరు సమర్పించే వారికి శనికి సంబంధించిన బాధలు పీడలు ఏవి ఉండవు.

Also Read:  Beetroot Juice: బీట్‌రూట్ రసం తాగడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు.. రక్తపోటు నుండి బరువు నియంత్రణ వరకు..!