IRCTC Special Trains : పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శైవక్షేత్రాలను దర్శించుకోవడాన్ని పుణ్యప్రదంగా భావిస్తుంటారు. ఇందుకోసం రెడీ అవుతున్న భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ వినిపించింది. దక్షిణ భారత దేశంలోని పలు పుణ్య క్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. దాని పేరు.. ‘దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ’. ఈ ప్యాకేజీ నవంబరు 6 నుంచి ప్రారంభంకానుంది. 9 రోజుల పాటు ఈ టూరు సాగుతుంది. ఇందులో భాగంగా తిరువణ్‌మలైలోని అరుణాచలం ఆలయం, రామేశ్వరం టెంపుల్, మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, కుమారి అమ్మణ్ టెంపుల్, త్రివేండ్రంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం, తిరుచ్చిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం చూడొచ్చు. ఈ ప్యాకేజీని బుక్ చేసుకునే వారికి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లో 2AC, 3AC & SL classesలో టికెట్లు కేటాయిస్తారు. ఈ ప్యాకేజీలోని(IRCTC Special Trains) మొత్తం 578 సీట్లలో SL క్లాస్ సీట్లు 320, 3AC క్లాస్ సీట్లు 206, 2AC క్లాస్ సీట్లు 50 ఉంటాయి.
Also Read :4000 Year Old Town : ఒయాసిస్ మాటున.. 4వేల ఏళ్ల కిందటి పట్టణం
ఏపీ, తెలంగాణ పరిధిలో..
- కార్తీక మాసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ ట్రైను సికింద్రాబాద్‌లో నవంబరు 6న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది.
- ఈ రైలుకు భువనగిరి, కాజీపేట, జనగామ, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలలో హాల్టింగ్ ఉంటుంది.
- ఆయా స్టేషన్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
- ఎస్‌ఎల్ క్లాస్‌లో పెద్దలకు టికెట్ రూ.14,250, 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ రూ.13,250.
- 3 ఏసీ క్లాస్‌లో పెద్దలకు టికెట్ రూ.21,900. పిల్లలకు టికెట్ రూ.20,700.
- 2ఏసీ క్లాస్‌లో పెద్దలకు టికెట్ రూ.28,450. పిల్లలకు టికెట్ రూ.27,010.
- టూరులో ఏడో రోజున తంజావూరుకు వెళ్లి బృహదీశ్వర ఆలయం చూస్తారు. అనంతరం సికింద్రాబాద్ తిరుగుపయనం అవుతారు.
- నవంబర్ 14న వేకువజామున 2.30 గంటలకు సికింద్రాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.
Also Read :Varun Tej : ఎంత పెద్ద తోపు అయినా పెళ్ళాం మాట వినాల్సిందే.. లావణ్యతో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- ఆలయాల ప్రవేశ ఫీజు, బోటింగ్ ఫీజు, ఇతర పర్యాటక ప్రదేశాల ప్రవేశ రుసుం యాత్రికులే చెల్లించాలి.
- డ్రైవర్స్‌కు ఇచ్చే టిప్స్, వెయిటర్స్‌కు ఇచ్చే టిప్స్, ఫ్యూయల్‌కు చెల్లించే సర్ ఛార్జ్ కూడా భరించాలి.