Site icon HashtagU Telugu

IRCTC Special Package : సరస్వతి పుష్కరాల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజ్

Saraswati Pushkaralu Irctc

Saraswati Pushkaralu Irctc

సరస్వతి పుష్కరాల (Saraswati Pushkaralu) సందర్భంగా భక్తుల సౌలభ్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ “అయోధ్య-కాశి పుణ్యక్షేత్ర యాత్ర” పేరుతో అందుబాటులోకి తెచ్చింది. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ (Bharat Gaurav Express) రైలు ద్వారా ఈ పర్యటన మే 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం తొమ్మిది రాత్రులు, పది పగళ్లు కొనసాగే ఈ యాత్రలో భక్తులు పూరీ, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పవిత్ర ప్రాంతాలను సందర్శించనున్నారు.

Tanda Gangs : తెలుగు రాష్ట్రాల్లో టాండా దొంగలు.. ఎవరు ?

ఈ ప్రత్యేక రైలును సికింద్రాబాద్ నుంచి ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అయ్యేలా భువనగిరి, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, తుని, విజయనగరం వంటి స్టేషన్లలో హాల్ట్ లభిస్తుంది. టూర్‌లో పూరీలో జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాలు, అయోధ్యలో బాలరాముడు, హనుమాన్ గర్హి ఆలయాలు, సరయూ నదిలో హారతి, అలాగే ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమ స్నానం వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి.

ఈ ప్యాకేజీ ధరల పరంగా కూడా మూడు కేటగిరీల్లో లభిస్తుంది. ఎకానమీ (స్లీపర్ క్లాస్) ధర ఒక్కరికి రూ. 16,800 కాగా, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.15,700గా నిర్ణయించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు రూ.26,600, పిల్లలకు రూ.25,300గా ఉండగా, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు రూ.34,900, పిల్లలకు రూ.33,300 చెల్లించాల్సి ఉంటుంది. సౌకర్యవంతమైన రైలు ప్రయాణంతో పాటు భోజనం, బస, గైడ్ సేవలు వంటి అన్ని సదుపాయాలతో ఈ ప్యాకేజీ భక్తులకు ఒక ఆధ్యాత్మిక యాత్ర అనుభూతిని కలిగించేందుకు రూపొందించబడింది.