ఇంద్రకీలాద్రి (Indrakiladri) పై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధి (Bejawada Kanaka Durgamma Temple) లో భనానీ దీక్షల (Bhavani Diksha) విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం వేదపండితులు, ఈఓ భ్రమరాంభ (EO Brahmaramba), ఆలయ అర్చకులు, స్ధానాచార్యులు హోమగుండాలకు ఆజ్యం సమర్పించారు. అగ్ని ప్రతిష్ఠాపన చేసి మూడు హోమగుండాలను వెలిగించి భవానీ దీక్ష విరమణలను ప్రారంభించారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు ఉంటాయి. భవాని దీక్షా విరమణలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
కరోనా తరువాత జరుగుతున్న దీక్షలు కావడంతో 7 లక్షల పైగా అమ్మవారి దర్శనార్ధం భవానీలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేస ఖండన శాలలు ఏర్పాటు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు అయ్యాయి. ఇంద్రకీలాద్రి కొండ (Bejawada Indrakiladri) చుట్టూ గిరి ప్రదక్షణ కు అధికారులు అనుమతి ఇచ్చారు. 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. దాదాపు 20 లక్షల లడ్డూ లను దుర్గ గుడి అధికారులు సిద్ధం చేశారు. సీతమ్మ పాదాలు, భవాని ఘాట్, పున్నమి ఘాట్ వద్ద జల్లు స్నానాలను అధికారులు ఏర్పాటు చేశారు.
Also Read: Vizag : ఏఎస్ఐ సత్యనారాయణ పై దాడి చేసిన ఓ యువతి..!