7 Planets Parade: సప్తగ్రహాలను ఒకే వరుసలో చూడాలని అనుకుంటున్నారా ? అయితే.. అతి త్వరలోనే ఆ అవకాశం మీకు దక్కబోతోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఆ అరుదైన ఖగోళ అద్భుతాన్ని మీరు చూడొచ్చు. మహా శివరాత్రి పండుగ ఫిబ్రవరి 26వ తేదీన జరగనుంది. ఈ పండుగ ముగిసిన రెండో రోజే సప్తగ్రహాలు ఒకే వరుసలోకి వస్తుండటం విశేషం.శుక్రుడు (వీనస్), కుజుడు (మార్స్), గురుడు (జూపిటర్), శని, యురేనస్, నెప్ట్యూన్, బుధుడు (మెర్క్యురీ) ఒకే వరుసలోకి చేరితే చూడాలని చాలామంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏడు అంకెకు, ఏడు గ్రహాలకు హిందూమతంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రత్యేకమైనదిగా, అరుదైనదిగా చెబుతున్నారు.
Also Read :Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమం.. ఆయన నేపథ్యం ఇదీ..
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8 వరకు..
సప్తగ్రహాలు ఒకే వరుసలో ఉండే అరుదైన సీన్‌ను మనం కూడా చూడొచ్చు. మన దేశంలో ఎక్కడి నుంచైనా దీన్ని తిలకించవచ్చు. ఫిబ్రవరి 28వ తేదీన ఒక్కరోజు మాత్రమే ఈ సప్తగ్రహాల(7 Planets Parade) లైన్ కనిపిస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఈ సీన్‌ను మనం మార్చి 8వ తేదీ వరకు చూడొచ్చు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8 వరకు రోజూ సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించిన 45 నిమిషాల తర్వాత, ఒకే వరుసలో ఉన్న సప్త గ్రహాలను చూడొచ్చు.
Also Read :Anganwadi Jobs: గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ
స్పేస్ టెలిస్కోప్ లేదా బైనాక్యులర్లు
మార్చి 3వ తేదీన సప్త గ్రహాల సమూహాన్ని స్పష్టంగా చూడొచ్చు. వీనస్, మార్స్, జూపిటర్, యురేనస్ గ్రహాలు మనకు నేరుగా కనిపిస్తాయి. అయితే శని, మెర్క్యురీ, నెప్ట్యూన్ గ్రహాలను చూసేందుకు స్పేస్ టెలిస్కోప్ లేదా బైనాక్యులర్లు అవసరం. మళ్లీ ఈ విధమైన సప్త గ్రహసంగమం 2040లో జరగనుంది. ఒకవేళ ఇప్పుడు దీన్ని చూడకపోతే.. ఇంకో 15 ఏళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఖగోళ ప్రేమికులు, పరిశోధకులు, విద్యార్థులు అందరూ ఈ సీన్‌ను చూసి ఎంజాయ్ చేయొచ్చు.