Cash Gift : శుభకార్యాల్లో రూ.101, రూ.1011 ఎందుకు ఇస్తారో తెలుసా ?

Cash Gift : శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఫలమో, పుష్పమో తీసుకెళ్లడం భారత సంప్రదాయం.

  • Written By:
  • Publish Date - March 2, 2024 / 12:56 PM IST

Cash Gift : శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఫలమో, పుష్పమో తీసుకెళ్లడం భారత సంప్రదాయం. ఇవేవీ తీసుకెళ్లడానికి వీలు లేకుంటే జేబులో ఉన్న నగదులో ఎంతోకొంత మొత్తాన్ని కానుకగా చదివిస్తారు. శుభకార్యాల టైంలో నగదు కానుకలు ఇచ్చే వాళ్లు ఓ ఒరవడిని ఫాలో అవుతుంటారు. చివరలో రూ.1 వచ్చేలా చదివింపులు(Cash Gift) ఉంటాయి.  11 రూపాయల నుంచి మొదలుకొని రూ. 21, రూ. 51, రూ. 111 దాకా చదివిస్తారు. మరీ దగ్గరి బంధువుల శుభ కార్యాల్లో రూ. 1111 దాకా కానుకను చదివిస్తారు. అలా కానుకను చదివించిన వారి పేరు పక్కనే వారి బంధుత్వం, ఊరు, పేరు, నిక్‌నేమ్‌ ఇలా చాలా విషయాలు మీకు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబాలు నేటికీ పెళ్లిళ్లు, పెరంటాళ్లు చేసిటప్పుడు చదివింపుల రూపంలో కానుకలు తీసుకుంటూ ఉంటారు. బంతి భోజనాలు పెట్టే సమయంలో పక్కనే ఓ ఇద్దరు వ్యక్తులు పుస్తకం బ్యాగ్ పట్టుకొని చదివింపులను రాస్తూ  ఉంటారు. భోజనం చేసిన తర్వాత వచ్చిన అతిథులు తమకు తోచినంత కానుకలు చదివిచ్చి వెళ్తారు.

We’re now on WhatsApp. Click to Join

సంఖ్యా శాస్త్రాన్ని ఫాలో అవుతూ..

చదివింపుల్లో రూ. 10, రూ. 100, రూ. 1000 ఇలా ఇస్తే ఇంకా సులభంగా ఉంటుంది కదా… ఎందుకు రూపాయిని అదనంగా ఇస్తారనే అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా ? వాస్తవానికి దీని వెనుక దాగిన లాజిక్ చాలామందికి తెలియదు. గురు, శుక్రులను ఆర్థిక బలానికి సంకేతంగా జోతిష్య శాస్త్రం భావిస్తుంది. ఆందుకే ఆ రెండు గ్రహాల ప్రభావం శుభకార్యం చేసే వారిపై ఉండాలని దీవిస్తూ ఇలా 1తో ఎండ్‌ అయ్యేలా నగదు కానుకలు ఇస్తారు. హిందూ సంప్రదాయంలో సంఖ్యాశాస్త్రానికి చాలా విలువ ఇస్తారు. అందుకే ఏ పని చేయాలన్నా, బయటకు వెళ్లాలన్నా న్యూమరాలజీని ఆధారంగా నిర్ణయించుకుంటారు. ఈ కానుకల విషయంలో కూడా అదే ఫాలో అవుతారు. ఎక్కువ మంది సరి సంఖ్యలను నమ్మరు. బేసి సంఖ్యలను ఎక్కువ విశ్వసిస్తారు. వాటితోనే మేలు జరుగుతుందని అనుకుంటారు. అందుకే 1 అనే అంకె ఉండేలా కానుకల్లో చూసుకుంటారు. మరికొందరు సంఖ్య మొత్తాన్ని కూడిన తర్వాత వచ్చేది బేసి సంఖ్య అయి ఉండాలని భావిస్తారు. నాణేలను లక్ష్మీ దేవితో పోలుస్తారు కొందరు. అందుకే నోట్లతోపాటు నాణేలు ఇవ్వడం వల్ల ఆ ఫ్యామిలీ ఇంట్లో ఐశ్వర్యం తులతూగుతుందని నమ్మకం.

Also Read : Vangi Bath: వంకాయలతో వేడి వేడిగా వాంగి బాత్ ఇలా చేస్తే చాలు టేస్ట్ అదిరిపోవాల్సిందే?

ఎంత  లాజిక్ ఉందో తెలుసా ?

  • అదనంగా ఇచ్చే 1 రూపాయి కచ్చితంగా నాణెం అయి ఉండాలని చాలా మంది చెబుతుంటారు. శుభకార్యం చేసే వాళ్లు రేపు వేయబోయే కొత్త అడుగుకు ఈ రూపాయే పెట్టుబడి అని, కానుకలోని మిగతా మొత్తం కార్యానికి అయిన ఖర్చుగా చెబుతారు.
  • సున్నాతో ఉన్న నగదు ఇస్తే అక్కడితో ఆగిపొమ్మని అర్థమని నమ్ముతారు. 1తో ఉన్న నగదు ఇస్తే సాగిపొమ్మనే మీనింగ్ ఉంటుందని అంటారు. అందుకే కానుకలో  ఒక రూపాయిని యాడ్ చేస్తారు.
  • సున్నాతో ఎండ్‌ అయ్యే సంఖ్యలు విభజించడానికి వీలుగా ఉంటాయి. అదే 101, 501 లాంటి సంఖ్యలు అలా కుదరుదు.
  • నగదు కానుక ఇచ్చే వాళ్లకు, తీసుకునే వాళ్లకు మధ్య ఉండే సంబంధాలు విడదీయరానివిగా ఉండిపోవాలని ఆకాంక్షిస్తూ ఇలా రూపాయి కలిపి ఇస్తుంటారు.
  • మనం ఎప్పుడైనా షాపింగ్‌కు వెళ్లినా, ఆన్‌లైన్ షాపింగ్‌ చేస్తున్నా రూ. 999 వస్తువును గమనిస్తే దాన్ని 900 రూపాయలుగానే చాలా మంది అనుకుంటారు. 1001 రూపాయలు ఉంటే దాన్ని వెయ్యి రూపాయలకు పైగానే భావిస్తారు.
  • ఇదే లాజిక్‌ కానుకల విషయంలో కూడా అప్లై అవుతుంది. అంటే 100 రూపాయలు ఇస్తే వందే అనుకుంటారు. అంతే 101 కచ్చితంగా వంద రూపాయలకు పైగానే ఇచ్చారనే ఫీలింగ్ ఉంటుంది.

Also Read :Gautam Gambhir : రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్‌బై.. నెక్ట్స్ ఫోకస్ దానిపైనే