Thursday Fast : గురువారం రోజు ఉపవాసం ఉంటే ఆ దోషం తొలగిపోవడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు..

హిందూ ధ‌ర్మంలో గురువారం (Thursday) శ్రీహరికి ప్రియ‌మైన‌ రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి పూజలు చేయడం వలన గురువు, నారాయణుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
If You Fast On Thursday, That Error Will Be Removed And Many More Benefits..

If You Fast On Thursday, That Error Will Be Removed And Many More Benefits..

Benefits of Fasting on Thursday : సనాతన ధర్మం ప్రకారం గురువారం బృహస్పతి కి అంకితం చేయబడింది. బృహస్పతిని గురు గ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే బృహస్పతిని జ్ఞానం, శక్తి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. అలాగే హిందూ ధ‌ర్మంలో గురువారం (Thursday) శ్రీహరికి ప్రియ‌మైన‌ రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి పూజలు చేయడం వలన గురువు, నారాయణుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే దోషం కూడా తొలగిపోతుందట. మై గురువారం (Thursday) ఉపవాసం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

గురువారాల్లో ఉపవాసం ఉండడం వల్ల విద్యా, జ్ఞాన అధిష్ఠాన‌ దేవతలు గురువు అనుగ్రహంతో సంతోషిస్తారు. ఫ‌లితంగా ఉపవాసం పాటించే వ్యక్తి వారి అనుగ్రహాన్ని పొందుతారు. గురువారం చేసే ఉపవాసం ఆ వ్యక్తి చేపట్టే అన్ని శుభ కార్యాలలో విజయం సాధించేలా చేస్తుంది. గురువు అనుగ్రహం వల్ల అత‌ని జీవితంలో శ్రేయస్సు, విజయం లభిస్తుంది. అలాగే గురువారం ఉపవాసం ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆ వ్య‌క్తి జీవితం అభివృద్ధి చెందుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల ధనలాభ అవకాశాలు పెరుగుతాయి. గురువారం ఉపవాసం వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. ఈ ఉపవాసం ద్వారా, ఒక వ్యక్తి తన అంతర్గత జీవితాన్ని మెరుగుపరుచుకోవ‌డం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధిని పొందుతాడు.

గురువారం ఉపవాసం ఉండాలంటే తెల్లవారుజామున లేచి స్నానం చేసి గురు మంత్రాలను పఠించాలి. తర్వాత రావి చెట్టు కింద పూజ చేసి బృహస్పతిని పూజించాలి. ఉపవాస సమయంలో సాత్విక ఆహారం మాత్ర‌మే తీసుకోవాలి, రోజంతా ధ్యానం చేస్తూ గ‌డ‌పాలి. గురువారం ఉపవాసం శ్రద్ధ, భక్తితో పూర్తి చేయాలి. ఈ రోజు గురు మంత్రాలను పఠించడం అత్యంత ప్రయోజనకరం. అలాగే ప‌ఠించ‌వ‌ల‌సిన అత్యంత ముఖ్య‌మైన మంత్రం”ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ బృహ‌స్ప‌త‌యే నమః” అనే మంత్రాన్ని పటించాలి. ఈ రోజు బెల్లం, శెనగపిండి, పసుపు, పెరుగు, బెల్లంతో చేసిన ఆహారాన్ని తింటే, జాత‌కంలో గురు బలం పెరుగుతుంది. మీరు గురువారం నాడు శ్రీమహావిష్ణువు విశేష అనుగ్రహం పొందాలంటే పైన చెప్పిన విషయాలన్నీ తప్పకుండా పాటించాలి.

Also Read:  Bitter Ground: పీరియడ్స్ కి వారం రోజులు ముందు కాకరకాయ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  Last Updated: 18 Dec 2023, 05:36 PM IST