Money Problem: పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో దురదృష్టం పట్టిపీడించడం ఖాయం?

మామూలుగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలకు మానసిక సమస్యలకు కారణం అవుతూ ఉంటాయి. తెలిసి తెలిసినా తెలియక చేసిన

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 06:10 PM IST

మామూలుగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలకు మానసిక సమస్యలకు కారణం అవుతూ ఉంటాయి. తెలిసి తెలిసినా తెలియక చేసిన కొన్ని కొన్ని సార్లు వాటి ఫలితాలను మనం అనుభవిస్తూ ఉంటాం. అలా ఉదయం లేచినప్పటి నుంచి మనం చేసే పనుల వల్ల కూడా కొన్ని కొన్ని సార్లు లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దాంతో లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోవడంతో ఆర్థిక నష్టాలు మొదలై దరిద్రం తాండమాడుతుంది. మరి ఎలాంటి పొరపాట్లను చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సూర్యోదయానికి ముందు లేదా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఉదయాన్నే లేవడం వల్ల మనలో సానుకూలత పెరుగుతుంది.

సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం. ఫ‌లితంగా మ‌న‌కు ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. మనం ఇంట్లో నీటిని వృధా చేయడం అశుభం. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల నీటి కుళాయి పగిలి అందులో నుంచి నీరు కారుతుంది. చాలా సార్లు మ‌నం దాని గురించి పట్టించుకోరు. కానీ, ఇంట్లోని నీటి కుళాయిల్లోని నీరు చుక్క చుక్క వృథా అయినట్లే, మన డబ్బు కూడా కొద్దికొద్దిగా వృథా అవుతుంది. అలాగే గురువారం, ఏకాదశి వ్రతం రోజు మన జుట్టు, గోళ్లను కత్తిరించడం అశుభం. ఈ రెండు రోజులు విష్ణుమూర్తికి ఇష్ట‌మైన రోజులు. ఆయా రోజుల్లో ఈ ప‌నులు చేస్తే లక్ష్మీదేవికి మీపై కోపం తెప్పించవచ్చు. ఇది మీ ఇంటికి ఆర్థిక సమస్యలను కూడా తీసుకురావచ్చు. గడియారం ఎల్లప్పుడూ మనకు సమయాన్ని సూచిస్తుంది.

ఇంట్లో ఆగిపోయిన, పాడైపోయిన గడియారాన్ని ఎప్పుడూ ఉంచవద్దు. ఇది మన సమయాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇంట్లో ఉన్న గ‌డియారం లేదా మన మణికట్టు మీద ఉన్న వాచ్ అయినా ప‌నిచేస్తూ, సరైన సమయాన్ని చూపుతూ ఉండాలి.సంధ్యా సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. వాటిలో పాలు, పెరుగు, ఉప్పు, పంచదార లేదా డబ్బు ముఖ్య‌మైన‌వి. సూర్యాస్తమయం తర్వాత వీటిని ఎవరికైనా ఇస్తే ఆర్థిక‌ సమస్యలు వస్తాయట. అదేవిధంగా తెగిపోయిన‌ చెప్పు మళ్లీ ధరించడం అశుభం అంటారు. అలాంటి చెప్పులు ఇంట్లో పెట్టుకోకూడదు. చెప్పులు, చిరిగిన బట్టలు లేదా పాత లేదా ఉపయోగించని బట్టలు కూడా ఇంట్లో ఉంచకూడదు.

ఇలాంటి వాటిని ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీ ఇంట్లో అలాంటి వస్తువులు ఉంటే, వాటిని ఎవరికైనా దానం చేయండి లేదా వాటిని సరిగ్గా పారవేయండి.bఇంట్లో దుమ్ము, ధూళి లేదా సాలెపురుగులు ఎక్కువగా ఉంటే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అలాంటి ఇంట్లో నివసించేవారు ధనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి అశుభ వస్తువులు ఇంట్లో ఉంటే అశుభమే కాకుండా దారిద్య్రం కూడా వస్తుంది. అలాగే పూజ చేయని ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివసించదు. ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేసే ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.