Site icon HashtagU Telugu

Pitru Paksha – Child Born : ‘పితృ ప‌క్షం’లో పుట్టే పిల్లల స్పెషాలిటీ ఏమిటో తెలుసా?

Pitru Paksha Child Born

Pitru Paksha Child Born

Pitru Paksha – Child Born : భాద్రపద మాసంలోని ‘శుక్లపక్షం’ దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో.. ‘బహుళ పక్షం’ పితృదేవతా పూజలకు అంతే శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి ‘పితృపక్షం’ అనే పేరు వచ్చింది.  ‘మహాలయ పక్షం’ అని కూడా పిలుస్తారు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణాలను, శ్రాద్ధాలను సమర్పించాలి.  కుదరకుంటే  తమ పితృదేవతలు ఏ తిథినాడు చనిపోయారో.. ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధ కార్యాన్ని నిర్వర్తించాలి.

We’re now on WhatsApp. Click to Join

ఈసారి సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 6 వరకు ‘పితృపక్షం’ ఉంది. రక్తం పంచుకు పుట్టిన పుత్రులే ‘పితృపక్షం’ అందించాలి. అప్పుడే వారికి  పితృఋణం తీరుతుంది. పుత్రులు రుణం తీర్చుకుంటేనే పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. అయితే పితృ పక్షంలో బిడ్డ పుడితే దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Also read :Posani : సిగ్గులేదా రోజా..ఓ బిల్డప్ ఇస్తావ్..అంటూ రోజా ఫై పోసాని ఫైర్ ..

పితృ పక్షంలో ఏ కుటుంబంలోనైనా సంతానం కలిగితే శుభప్రదమే. ఈ పిల్లలు పూర్వీకుల ఆశీస్సులతో పుడతారు.  వారికి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. ఈ పిల్లలకు పూర్వీకుల లక్షణాలు, పోలికలు కూడా ఉంటాయి. పితృ పక్షంలో పుట్టిన పిల్లలు క్రియేటివ్ గా ఉంటారు. సమాజంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఈ పిల్లలు కుటుంబానికి కూడా అదృష్టాన్ని పంచుతారు.  ఈ పిల్లలు వారి వంశానికి మూలపురుషులు అవుతారు. పితృ పక్షంలో పుట్టిన పిల్లల జాతకం జ‌న్మ కుండ‌లిలో చంద్రుని స్థానం చాలా బలహీనంగా (Pitru Paksha – Child Born) ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.