Site icon HashtagU Telugu

Spatika: కష్టాల నుంచి విముక్తి పొందాలంటే స్పటికతో ఈ పరిహారాలు చేయాల్సిందే!

Spatika

Spatika

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కష్టాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. నా కష్టాలు లేని వారు అంటూ ఉండరేమో. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో మిగలడం లేదని, దిగులు చెందుతూ ఉంటారు. అయితే అలాంటి వారు కష్టాల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే స్పటికతో కొన్ని పరిహారాలు పాటించాలని చెబుతున్నారు. మరి స్పటికతో ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. నరదృష్టి తొలగడానికి వ్యాపారవేత్తలు దీనిని తమ షాపులో పెట్టుకుంటారు. నరదృష్టి తొలిగి ధనాకర్షణ పెరగడానికి పటికను ఈ విధంగా ఉపయోగించాలి.

ఇంట్లో చికాకులు, గొడవలు లేకుండా ఉండాలన్నా నరఘోష నరపీడ తొలగాలి, ఆర్థికపరమైన చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలన్నా కూడా స్పటికతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అమావాస్య నాడు ఎట్టి పరిస్థితులలో స్పటికను కొనకూడదు. సాయంత్రం 6:00 దాటిన తర్వాత కొనకూడదు. ఒక పెద్ద స్పటికను ఆది, సోమవారాల్లో మాత్రమే ఇంటికి తెచ్చి పెట్టుకోవాలి. అమావాస్య నాడు లేదంటే పౌర్ణమి గడియల్లో, ఏదైనా శనివారం లేదా ఆది, సోమవారాల నాడు ఇంటి గుమ్మం పైన కట్టాలి. ధారంతో లేదా వెంట్రుకలతో చేసిన తాడుతో కలిపి కట్టాలి. లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పట్టికను పెట్టి మూటగట్టి గుమ్మం పైన వేలాడదీయాలి.

దీనిని ప్రతి అమావాస్యకు ఒకసారిగానీ మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి గానీ మన వీలును బట్టి మార్చుకోవచ్చు. వాడిన స్పటికను నీటిలో వదలాలి. ఇంటిలోనికి తీసుకొని వెళ్లకూడదు. ఈ స్పటిక క్రింద నుంచి మనం వస్తూ వెళ్తూ ఉండడం వల్ల అది మనలో ఉన్న ప్రతికూల శక్తిని, నరదృష్టిని. లాగేసుకుంటుంది. తాంత్రిక ప్రయోగాలను తొలగించుకోవడానికి ఒక నల్లటి వస్త్రంలో స్పటికతో పాటు ఆరు లవంగాలు ఒక రూపాయి కాయిన్ వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో తొమ్మిది సార్లు చుట్టి మూటగట్టి ఆఫీస్ బయటగాని ఇంటి గుమ్మంపైన గానీ కట్టినట్లయితే అన్నీ తొలగిపోయి జనాకర్షణ పెరుగుతుందట. అలాగే నరఘోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న స్పటిక ముక్కని దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయట.

పీడకలలు రాకుండా ఉండాలంటే దిండు క్రింద ఒక స్పటిక ముక్క పెట్టి పడుకోవాలట. వ్యాపార స్థలంలో ఒక పెద్ద స్పటిక ముక్క ఒక గాజు ప్లేటుపై ఉంచుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఒక స్పటిక ముక్కను కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికీ కనిపించకుండా ఒక నెల వరకు ఒక మూల ఉంచినట్లయితే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుందట. ఆ తర్వాత స్పటికను ఇంటి బయట ఎక్కడైనా ఒక గుంత తీసి పాతిపెట్టాలి. వ్యాపారం నష్టపోకుండా ఉండాలన్నా ఇంట్లో డబ్బు నిలవడానికి స్పటిక పౌడర్ ని నీటిలో కరగనిచ్చి ఆ నీటిలో తడిబట్ట వేసి ఇల్లంతా తుడుచుకోవాలి. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందట. లక్ష్మీదేవికి ప్రీతిక కనుక స్పటికను ఇంట్లో ఈ విధంగా ఉపయోగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం త్వరగా కలుగుతుంది. స్పటికను కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛతను, పారదర్శకతను పరీక్షించాలి. మంచి నాణ్యత గల స్పటికను మాత్రమే కొనుగోలు చేయాలి. స్పటికను శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం, దానిని తరుచూ శుభ్రం చేయడం చాలా ముఖ్యం అని పండితులు చెబుతున్నారు.