తిరుమల శ్రీవారిని (Tirumala Srivari) దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో అన్నప్రసాద వితరణ (నిత్యాన్నదానం) ఒక ముఖ్యమైన సేవ. భక్తుల ఆకలి తీర్చేందుకు ప్రతిరోజూ అన్నప్రసాద భవనంలో వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం అందించబడుతుంది. అయితే ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలంటే ఆశ్చర్యం కలిగించే సమాచారం వెలువడుతోంది.
AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్ పై రోజా కౌంటర్
తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు టీటీడీ ప్రత్యేక విరాళ పథకాన్ని అమలు చేస్తోంది. తిరుమలలో ఒకరోజు మొత్తం అన్నప్రసాద సేవ నిర్వహించేందుకు రూ.44 లక్షలు ఖర్చవుతుంది అని టీటీడీ ప్రకటించింది. ఇందులో ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేసింది. ఈ నిత్యాన్నదాన కార్యక్రమానికి విరాళంగా రూ.44 లక్షలు అందించే దాతల పేరును మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.
Akira Nandan : అకీరాను లాంచ్ చేసేది అన్నయ్యేనా..?
అన్నప్రసాద సేవలో దాతలకు మరికొన్ని ప్రత్యేక అవకాశాలను టీటీడీ అందిస్తోంది. విరాళం ఇచ్చిన భక్తులు స్వయంగా అన్నప్రసాద వితరణలో పాల్గొనవచ్చు. భక్తులకు స్వయంగా భోజనం వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. దీని ద్వారా భక్తులు స్వామి వారి సేవలో తరిసే అవకాశం పొందుతారు. ఈ పథకం ద్వారా భక్తుల సేవలో తమ సహాయాన్ని అందించాలనుకునే భక్తులు టీటీడీని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని దేవస్థానం ప్రకటించింది.