Site icon HashtagU Telugu

Ugadi 2025 : ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు..?

Why Do We Celebrate Ugadi

Why Do We Celebrate Ugadi

ఉగాది (Ugadi ) అంటే కొత్త సంవత్సరానికి శ్రీకారం చుట్టే పండుగ. ఇది కేవలం తెలుగు వారికే కాకుండా మరెన్నో ప్రాంతీయ సంస్కృతులలోనూ ఉత్సాహంగా జరుపుకునే పర్వదినం. తెలుగు ప్రజలు ఉగాదిని వైభవంగా జరుపుకుంటారు. మరాఠీలు దీనిని ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’గా, మలయాళీలు ‘విషు’గా, సిక్కులు ‘వైశాఖీ’గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’గా జరుపుకుంటారు. ఈ విధంగా భారతదేశం మొత్తం ఈ కొత్త సంవత్సరం ఉత్సవాన్ని భిన్న పేర్లతో, భిన్న సంప్రదాయాలతో జరుపుకుంటారు.

పురాణ గాధల ప్రకారం ఉగాది విశిష్టత

పురాణాల ప్రకారం.. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు సృష్టిని ఆవిర్భావం చేసిన రోజు. అందువల్లనే ఈ రోజును విశేషంగా పరిగణిస్తారు. మరో పురాణ గాధ ప్రకారం.. సోమకుడు అపహరించిన వేదాలను తిరిగి సాధించేందుకు విష్ణువు మత్స్యావతారం తీసుకుని, వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభసందర్భంగా ఉగాది పండుగ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది కేవలం ధార్మికతకు మాత్రమే పరిమితం కాకుండా కాలచక్రానికి కూడా సంబంధించి, సూర్యోదయ సమయానికి అనుగుణంగా కొత్త సంవత్సరానికి ఆరంభ సూచనగా నిలుస్తుంది.

ఉగాది పండుగను జరుపుకునే విధానం

ఉగాది రోజున తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేసి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరిస్తారు. కొత్త వస్త్రాలు ధరించి, భగవంతుడిని పూజించి, పంచాంగ శ్రవణం నిర్వహించడం ఆచారంగా ఉంది. ఉగాది పచ్చడి ముఖ్యంగా ఆరోగ్య పరంగా, జీవితపు అనుభవాలను ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఉగాది కొత్త ఆశలు, కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని, ఈ రోజున దైవాన్ని ఆరాధించి, భవిష్యత్తులో మనకు మంచి జరగాలని కోరుకుంటారు.

Mango Flower: వామ్మో.. మామిడి పూత వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?