Site icon HashtagU Telugu

Krishna Janmashtami : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో కృష్ణాలయం ఎక్కడ ఉందొ తెలుసా..?

Himachal Pradesh Krishna Te

Himachal Pradesh Krishna Te

హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, అష్టమి రోహిణి, గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. విష్ణు మూర్తి.. పది అవతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడని పురాణోక్తి. ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో గోపాలుడి జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

నేడు జన్మాష్టమి సందర్భంగా వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఇస్కాన్, రాధాకృష్ణులు, వైష్ణవ ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన మందిరాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మస్థానం మథురలో 2000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్, కైలాష్, ద్వారక, ముంబై, మనాలి, హైదరాబాద్ ఇస్కాన్ మందిరాల వద్ద భక్తులు క్యూ కట్టారు.

ఇక చిన్నారులు కిట్టయ్య వేషధారణలో సందడి చేస్తున్నారు. వీధుల్లో, ఇళ్లల్లో నల్లనయ్య పాటలు మార్మోగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని (Himachal pradesh Krishna temple) కిన్నెర్ జిల్లాలో అత్యంత ఎత్తులో కృష్ణ ఆలయం ఉంది. పర్వతాలపై సరస్సు మధ్యలో ఉన్న ఈ గుడిని చేరుకునేందుకు 12 కి.మీలు ట్రెక్కింగ్ చేయాలి. పాండవులు హిమాలయాల్లో అజ్ఞాతవాసం గడిపినప్పుడు ఈ సరస్సు ఏర్పడిందని ప్రతీతి. జన్మాష్టమి సందర్భంగా జిల్లాలోని భక్తులు ఆలయానికి చేరుకుంటారు. వేసవిలో మినహా మిగతా కాలాల్లో ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది.

Read Also : Parawada Pharma City Incident : ముగ్గురు మృతి