Dream About God Worship : నిద్రలో అప్పుడప్పుడు అందరికీ కలలు వస్తుంటాయి. మనం చూసే కలల్లో కొన్ని మన కోరికలు, ఆశలతో ముడిపడి ఉంటాయి. ఇంకొన్నికలలను మనం అర్థం చేసుకోలేక వదిలేస్తుంటాం. వాస్తవానికి కలలు ఫ్యూచర్ లో జరిగే ఛాన్స్ ఉన్న కొన్ని సంఘటనలను సూచిస్తుంటాయి. ఒకవేళ మీకు దేవుడిని పూజిస్తున్నట్టుగా కల వస్తే.. అది మీ జీవితంలో రాబోయే గొప్ప మార్పుకు సిగ్నల్ లాంటిది. కలలో మీరు సింగిల్ గా పూజ చేస్తుంటే అర్థం ఏమిటి ? కలలో మీరు ఫ్యామిలీతో కలిసి పూజ చేస్తుంటే అర్ధం ఏమిటి ? పూజారులు పూజ చేస్తున్నట్లు కలలో చూస్తే అర్ధం ఏమిటి ? స్వప్నశాస్త్రం ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Also read : New Parliament : ఇకపై కొత్త భవనమే భారత పార్లమెంటు.. కేంద్ర సర్కారు గెజిట్
- మీరు సింగిల్ గా పూజ చేస్తున్నట్టు కల వస్తే.. దేవుడిపై మీకు ఉన్న భక్తికి అది నిదర్శం. ఇలాంటి కల వస్తే.. త్వరలో మీ ఇంట్లో శ్రేయస్సుకు బాటలు పడతాయి. కొన్ని మంచి మార్పులను మీరు చూస్తారు. మీ జీవితంపై పాజిటివ్ ఎఫెక్ట్ ను చూపించే కల ఇది. ఈ తరహా కల వస్తే.. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే దేవుడి రూపాన్ని చూడండి అని స్వప్నశాస్త్రం సూచిస్తోంది.
- ఫ్యామిలీతో కలిసి మీరు దేవుడిని పూజిస్తున్నట్టుగా కల వస్తే.. మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ లభించబోతోందని అర్థం చేసుకోవచ్చు. టీమ్ వర్క్ చేస్తే మీకు లాభం, విజయం చేకూరుతాయనేది కూడా దీని అర్ధం. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాబోయే విజయానికి సంకేతం ఇది అని స్వప్న శాస్త్రం చెబుతోంది.
- ఒక పూజారి గుడిలో పూజలు చేస్తున్నట్లుగా కలలో కనిపిస్తే.. అది మీ కోరికలు త్వరలో నెరవేరబోతున్నాయని అర్థం. ఈ కల వచ్చిన వారు.. మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వెళ్లి పూజలు చేయాలి. మీరు చాలా కాలంగా ఆలయ దర్శనానికి దూరంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి కల వస్తుంటుంది. మీరు వెంటనే ఆలయాలను సందర్శించాలని ఈ కల (Dream About God Worship) సిగ్నల్ ఇస్తుంది.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.