Birds : మీ ఇంట్లోకి అలాంటి పక్షులు వచ్చాయా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

ఆ పక్షులు (Birds) అక్కడే తిష్ట వేసుకొని ఇళ్లలోనే గూడు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కొన్ని పక్షులు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
Have Such Birds Entered Your House.. But Do You Need To Know This..

Have Such Birds Entered Your House.. But Do You Need To Know This..

Birds entering into House : మామూలుగా చాలామంది ఇంట్లో అనేక రకాల పక్షులను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇంకొంతరు మాత్రం ముఖ్యంగా పల్లెటూర్లలో ఇంట్లోకి వచ్చే పక్షులకి ఆహారాన్ని పెడుతూ ఉంటారు. దాంతో ఆ పక్షులు (Birds) అక్కడే తిష్ట వేసుకొని ఇళ్లలోనే గూడు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కొన్ని పక్షులు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని రకాల పక్షులు (Birds) ఇంట్లోకి రావడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు త్వరలోనే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయట. అయితే కొన్ని పక్షులకు శుభ అశుభ సంకేతాలు ఉన్నాయి. అంటే కొన్ని పక్షులంటే శుభానికి సంకేతమని, కొన్ని పక్షులంటే అపశకునమని భావిస్తూ ఉంటారు.

We’re Now on WhatsApp. Click to Join.

కొన్ని పక్షులకు సంబంధించి కొన్ని సంకేతాలు, లక్షణాలు ఉంటాయి. అదే సమయంలో కొన్ని పక్షులు (Birds) ఇంటికి రావడం అత్యం శుభ సూచకంగా భావించాలి. ఇంటికి రామ చిలుకలు వస్తే శుభ సూచకంగా బావించాలి. వాస్తు ప్రకారం ఇంటికి ఆకశ్మికంగా రామ చిలుక వస్తే అత్యంత శుభంగా పరిగణిస్తారు. రామచిలుక రావడం వల్ల ధన లాభం కలుగుతుంది. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఇంట్లోకి రావడం కూడా శుభ సూచకంగా భావించాలి. ఎందుకంటే గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. ఒకవేళ ఏదైనా ఇంటికి గుడ్లగూబ వచ్చినా లేక ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ కనిపించినా ఆ ఇంట్లోని వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్ధం. గుడ్లగూబ వచ్చిందంటే ఇంట్లో ధనం లాభం కలగడంతో పాటు, సుఖ శాంతులు కూడా కలుగుతాయి.

ఇంట్లో పిచ్చుకలు ఇళ్లు కట్టుకుంటే చాలా శుభప్రదమని అర్ధం. వాస్తు ప్రకారం ఇంట్లో పిచ్చుకల గూడు ఉందంటే ఆ ఇంట్లో మంచి జరగనుందని సంకేతమట. అంతేకాకుండా ఆ ఇంట్లో సుఖ సౌభాగ్యం, సమృద్ధి ప్రాప్తిస్తాయి. ఇంట్లో పిచ్చుక గూడు కట్టుకుందంటే మీ ఇంట్లో అంతులేని ఆనందం కలగనుందని అర్ధం. ఆఖరికి ఇంటికి కాకులు రావడం కూడా మంచి శకునంగానే భావిస్తారు. ఎవరైనా ఇంటికి కాకులు వచ్చినా లేదా కాకి అరుపులు అదే పనిగా విన్పించినా ఆ ఇంటికి అతిధులు లేదా బంధువులు వస్తున్నారని అర్ధం.అలాగే నీలకంఠ పక్షి రావడమంటే చాలా శుభప్రదం. ఎందుకంటే నీలకంఠ పక్షి అనేది చాలా అరుదుగా కన్పిస్తుంది. మీ ఇంటిపై ఈ పక్షి వస్తే ఇక మీకు అదృష్టం తన్నుకొచ్చినట్టే అర్ధం. ఇంకా సులభంగా చెప్పాలంటే పెద్దఎత్తున లాటరీ తగలనుంది. అదే నీలకంఠ పక్షి దసరా రోజున ఇంటికి వస్తే మాత్రం ధన సంపదలు, అదృష్టం, సౌభాగ్యం వద్దంటే వస్తుంది.

Also Read:  Soul In Hospital : ఆత్మ కోసం ఆస్పత్రిలో పూజలు.. ఏం చేశారంటే ?

  Last Updated: 24 Nov 2023, 12:34 PM IST