ఈరోజు పెద్ద హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్బంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. అలాగే జయంతి ఉత్సవాలు సైతం వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉత్సవాలు ప్రారంభం కాగా, నేడు అంజన్న జయంతి కావటంతో అర్ధరాత్రి నుంచే స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు వేలాదిగా తరలించారు. మాలధారులు దీక్షా విరమణ చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 2 లక్షల మంది దీక్ష విరమణ చేసినట్టు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉత్సవాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, భక్తులకు ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా… అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వాహణపై దృష్టి పెడుతున్నామని , కోనేరులో నీళ్లను ఎప్పటికప్పుడూ మార్చుతున్నట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
శనివారం మధ్యాహ్నం వరకు దీక్షాపరుల రద్దీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పుణ్యక్షేత్రంలో మత సామరస్యం వెల్లివిరిసింది. భానుడి ప్రతాపాన్ని లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్న హనుమాన్ దీక్షా పరులకు ముస్లిం సోదరులు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లతో సేవలందించారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సిరాజుద్దీన్ మన్సూర్ తన సోదరులతో కలిసి కొండగట్టు పుణ్యక్షేత్రంలో హనుమాన్ దీక్షాపరులకు మజ్జిగ, మంచినీళ్లు ప్యాకెట్లను అందించారు. కాలినడకన మండుటెండలో కొండగట్టుకు చేరుకుంటున్న భక్తులకు ముస్లిం సోదరులు చేపట్టిన సేవ ఉపశమనం కలిగించింది.
Read Also : Telangana Formation Day : గన్‌పార్క్ చుట్టూ ఇనుప కంచె..ఇదేనా కాంగ్రెస్ ఇచ్చే గౌరవం – BRS