Greenfield Airport : ప్రముఖ్య పుణ్యకేత్రం శబరిమలకు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు ప్రతిపాదనలు వేగంగా కదులుతున్నాయి. అయితే ఆ విమానాశ్రయం కోసం సుమారు 3.4 లక్షల చెట్లను తొలగించాల్సి ఉంటుందని కొట్టాయం జిల్లాశాఖ ఓ నివేదికను తయారు చేసింది. దీని కోసం సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నివేదికను రూపొందించారు. ఒకవేళ ఎయిర్‌పోర్టు నిర్మిస్తే సుమారు 353 కుటుంబాలను తరలించాల్సి వస్తుందని రిపోర్టులో పేర్కొన్నారు.
విమానాశ్రయం కోసం 1039.876 హెక్టార్ల భూమి అవసరం అవసరమని నివేదించిన అధికారులు.. ఆ భూమిని మణిమాల, ఎరుమేలి సౌత్ గ్రామాల నుంచి సేకరించేలా ప్రణాళికలు సిద్దం చేసారు. దీని ద్వారా శబరిమల యాత్రికులు, ఎన్ఆర్ఐలు, పర్యాటకులు, ఇతర ప్రయాణికుల ఉద్దేశంతో కేఎస్ఐడీసీ ప్రాజెక్టును చేపడుతున్నారు. శబరిమల ఎయిర్‌పోర్టుతో ట్రావెన్‌కోర్ యాత్రా స్థలాలకు వెళ్లే మార్గాలకు దారి సులువు అవుతుంది. ఇందుకు మార్గాన్ని సూచించారు. దీని పైన వచ్చే వారం కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం 3.3 లక్షల రబ్బరు, 2492 టేకు, 2247 వైల్డ్ జాక్, 1131 జాక్‌ఫ్రూట్, 828 మహోగని, 184 మామిడి చెట్లను తొలగించాల్సి ఉంటుంది. చెట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ఏడు మతపరమైన ప్రదేశాలను మార్చాల్సి వస్తోందని రిపోర్టులో తెలిపారు. ఇక్కడే చెరువెల్లి జాతి ఆవు కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఎస్టేట్‌ను మార్చేస్తే, అప్పుడు ఆవుల పరిస్థితి దయనీయంగా ఉంటుందని రిపోర్టులో వెల్లడించారు. శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు ద్వారా 347 కుటుంబాలు నేరుగా నష్టపోనున్నారు. దీంట్లో 238 కుటుంబాలు చెరువెల్లి ఎస్టేట్‌లో పనిచేస్తున్నారు. వావరు మసీదు, మారమన్ కన్వెన్షన్, ఎటుమన్నూర్ మహాదేవ ఆలయం లాంటి ప్రదేశాలకు యాక్సిస్ పెరుగుతుంది. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ బలపడనున్నది. టూరిస్టుల సంఖ్య పెరగనున్నది. కుమరొక్కం బ్యాక్‌వాటర్స్, మున్నార్ హిల్ స్టేషన్స్, గావి ఫారెస్ట్, టెక్కడీ వైల్డ్‌లైఫ్ సాంక్చరీ, పెరియార్ టైగర్ రిజర్వ్, ఇడుక్కి డ్యామ్‌కు లింకు రోడ్డు ఈజీ అవుతుందని రిపోర్టులో వెల్లడించారు.
Read Also: Rythu Bharosa: రైతన్నలకు గుడ్ న్యూస్.. జనవరి 14 నుంచి రైతు భరోసా..!