Site icon HashtagU Telugu

TTD : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Ttd Employees

Ttd Employees

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి ఇటీవల జరిగిన సమావేశంలో ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, పోటు కార్మికులకు (TTD Employees) మేలు కలిగించే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ముఖ్యంగా పోటు కార్మికులకు మెరుగైన వైద్య సహాయం అందించడంతో పాటు వారి జీతాలలో కోత లేకుండా పూర్తి మొత్తాన్ని చెల్లించే చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే టీటీడీ కాలేజీల్లో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న 151 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానించింది.

Cabinet Expansion: ఉగాదికల్లా మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్‌ అగ్రనేతలతో సీఎం రేవంత్‌ భేటీ

ఇక తిరుమల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 25న నిర్వహించనున్న పుష్పయాగానికి సంబంధించిన శాస్త్రోక్త కార్యక్రమాలు సోమవారం సాయంత్రం అంకురార్పణంతో ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం నిర్వహించి, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల భక్తుల వల్ల తెలియక జరిగిన దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

Samsung : డిజిటల్ ఉపకరణాలపై శామ్‌సంగ్ పండుగ ఆఫర్లు

అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, ఏప్రిల్ 9న హనుమంత వాహనం, ఏప్రిల్ 10న గరుడ వాహనం, ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 12న రథోత్సవం, ఏప్రిల్ 14న చక్రస్నానం వంటి ముఖ్యమైన ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని టీటీడీ కోరింది.