Site icon HashtagU Telugu

Golden Baba : 6 కేజీల బంగారు ఆభరణాలతో గోల్డెన్ బాబా.. మహాకుంభ మేళాలో సందడి

Golden Baba In Maha Kumbh 2025

Golden Baba : 6 కేజీల బంగారు ఆభరణాలను ధరించిన గోల్డెన్ బాబా సందడి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో ఆయన  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.  గోల్డెన్ బాబా ఆభరణాల్లో రుద్రాక్షలు, పగడాలు, ఎరుపు పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగి ఉన్నాయి. శ్రీ యంత్రం చిహ్నాన్ని కూడా ఆయన ధరించారు. కేరళకు చెందిన ‘గోల్డెన్ బాబా’ పూర్తి పేరు 1008వ అనంత శ్రీ విభుశిత్ స్వామి నారాయణానంద్ గిరి మహరాజ్. ఆయనతో ఇంటర్వ్యూ వివరాలివీ..

Also Read :Mysterious Disease : కశ్మీర్‌లో హైఅలర్ట్.. అంతుచిక్కని వ్యాధికి 16 మంది బలి

మీరు ఎందుకు ఇంతగా బంగారు ఆభరణాలు ధరిస్తారు ?

గోల్డెన్ బాబా :  నేను ఈ ఆభరణాలను దేవతల సూచకంగా ధరించాను. నటరాజ స్వామి, నరసింహ స్వామి, మురుగన్ స్వామి, భద్రకాళి స్వామి తదితర దేవతలకు గుర్తుగా వీటిని మెడలో వేసుకున్నాను. వాటి నుంచి నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది.

మీ ఆభరణాల ప్రత్యేకత ఏమిటి ?

గోల్డెన్ బాబా :  నా ఆభరణాల్లో రుద్రాక్షలు, పగడాలు, ఎరుపు పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగి ఉంటాయి. దేవతా పూజల్లో కూడా వీటిని వినియోగిస్తుంటారు. అందుకే అవి పవిత్రమైనవి.

మీ గురించి చెప్పండి ?

గోల్డెన్ బాబా : నేను కేరళ వాస్తవ్యుడిని. ఆ రాష్ట్రంలో సనాతన ధర్మ ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తుంటాను. ప్రతీ కుంభ మేళా కోసం ప్రయాగ్ రాజ్‌కు వస్తుంటాను.

Also Read :Trump Swearing In : ఎల్లుండి రోటుండాలో ట్రంప్ ప్రమాణస్వీకారం.. రోటుండాలో ఎందుకు ?

Also Read :Urvashi Rautela: సైఫ్ అలీఖాన్‌కు క్షమాపణలు చెప్పిన నటి ఊర్వశీ రౌతేలా